Tuesday, December 10, 2024

Story – జీసోలార్ సిస్టమ్స్ .. లేపేశారు! వైసీపీ లీడర్ల చేతివాటం?

ఆంధ్రప్రభ స్మార్ట్, ఏఎస్‌ఆర్‌ జిల్లా ప్రతినిధి: అల్లూరి సీతారామరాజు జిల్లా మారుమూల ప్రాంత గిరిజనులకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు- చేసిన సోలార్‌ విద్యుత్‌ సామాగ్రి చోరికి గురైంది. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండల్లోని 123 గిరిజన గ్రామాల్లో విద్యుత్‌ సౌకర్యం లేని మారుమూల పలెల్లో వికేంద్రీకృత పంపిణీ తరం (డీ సెంట్రలైజ్డ్‌ డిస్ట్రిబ్య్రూషన్‌ జనరేషన్‌ (డీడీజీ)) పథకం ద్వారా సౌర విద్యుత్తు యూనిట్లను ఏర్పాటు చేశారు.

ఈ సౌర విద్యుత్‌ను గ్రామాల్లో నివాసముంటున్న కుటు-ంబాలు ఆధారంగా ఒక్కోక్కో యూనిట్‌కి రూ. 5 లక్షల నుండి రూ.20లక్షల వరకు ఖర్చు చేసి నెలకొల్పారు. సౌర విద్యుత్‌ ఏర్పాటు చేసిన అనంతరం తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ ప్రతి గ్రామంలో విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని సంకల్పంచింది. ఈ సంకల్పంతో మారుమూల పల్లెలకు విద్యుత్‌ సదుపాయం కల్పించుకుంటూ వచ్చింది. సౌర విద్యుత్‌ ఉన్న గ్రామాల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించడంతో సౌర విద్యుత్తు యూనిట్ల నిర్వహణపై అధికారులకు శ్రద్ద తగ్గింది ఫలితంగా ఆ యూనిట్లు మూలనపడి మర్మమత్తులకు గురయ్యాయి.

సౌర విద్యుత్‌ సామాగ్రి మాయంమన్యంలోని మారుమూల పల్లెల్లో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్‌ యూనిట్లలోని అతి విలువైన బ్యాటరీలు, ప్యానల్‌ బోర్డులు, సోలార్‌ ప్లేట్స్‌ క్రమంగా మాయవ్వడం మొదలైయి ప్రస్తుతం పాడేరు ఐటీడీఏ పరిధిలోని జీకే వీధి, చింతపల్లి మండలాల్లోని 123 గ్రామాల్లో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్‌ యూనిట్లలో 96 గ్రామాల్లోని పరికరాలు మాయమయ్యాయని విద్యుత్‌ అధికారులు అంచనా వేశారు.

- Advertisement -

ఈ సౌర విద్యుత్‌ చోరీలో రూ. 20 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. తేదేపా ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన యూనిట్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో మాయమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.వైసీపీ నేతల కనుసన్నల్లోనే చోరీలు ఏజేన్సీలోని ఆదివాసీ పల్లెల్లో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్‌ యూనిట్లకు సంబంధించిన సోలార్‌ బ్యాటరీలను, ప్యానెల్‌ బోర్డులతో పాటు ఇతర సౌర విద్యుత్‌ సామాగ్రిని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ, తుని ప్రాంతాలకు చెందిన దొంగల ముఠా వైసీపీ నేతల కనుసన్నల్లో అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి మైదాన ప్రాంతాలకు తరలించినట్లు విశ్వసనీయ సమాచారం.

ఈ భారీ కుంభకోణంలో అల్లూరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ఈ సోలార్‌ బ్యాటరీల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించినట్లు-గా తెలుస్తుంది.వైసీపీ నాయకుల వివాదంతో బయటకుఈ మధ్యకాలంలో జీకే వీధి మండలానికి అతి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఈ సోలార్‌ బ్యాటరీల వ్యవహారంలో ఇద్దరు వైసీపీ నాయకుల మధ్య జరిగిన వాగ్వాదంతో అసలు విషయం బయటకు వచ్చినట్లు వదంతులు ఉన్నాయి.

సౌర విద్యుత్‌ సామాగ్రి మాయమైన విషయం అధికారులకు, పోలీసులకు తెలిసినప్పటకీ బయటకు పొక్కనీయకుండా రహస్యంగా ఉంచినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంత గిరిజనులకు విద్యుత్‌ సదుపాయం కల్పించాలని బహుత్తర లక్ష్యంతో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్‌ యూనిట్లు వైసీపీ నేతల చేష్టలతో ఇటు కేంద్ర అటు రాష్ట్ర ప్రభుత్వాల ఆశయం చీకటిగా మారిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం : సిరిబాల బుజ్జిబాబు,

సర్పంచ్‌, దేవరపల్లిఏజేన్సీ గ్రామాల్లోని సౌర విద్యుత్‌ సామాగ్రి మాయమైన, చోరికి గురైనా నేటీకి అధికారులు స్పందించకపోవడం విడ్డూరం. ఈ విషయంలో అధికారులు నిజాలను నిగ్గు తెల్చకపోతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం

.సర్వసభ్య సమావేశాల్లో ప్రస్తావించినా : అంపురంగి బుజ్జిబాబు, ఎంపీటీసీ,

గాలికొండప్రతి సర్వసభ్య సమావేశాల్లో సౌర విద్యుత్‌ యూనిట్ల చోరికి సంబంధించిన విషయంపై పలుమార్లు ప్రస్తావించినప్పటకీ నేటీకి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయం అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి ఏడాది అయినప్పటకీ కనీస చలనం లేని అధికారులు ఉన్నారు. ఉన్నతాధికారులు పూర్తి విచారణ జరిపించాలి.

మాయమైన మాట వాస్తవమే : ప్రభాకర్‌, ఏఈఈ, విద్యుత్‌ శాఖజీకే వీధి,

చింతపల్లి మండలాల్లో సౌర విద్యుత్‌ సామాగ్రి మాయమైన మాట వాస్తవమే. బ్యాటరీలు, ప్యానెల్‌ బోర్డు ఇతర సామాగ్రి సైతం చోరికి గురయ్యాయి. ఈ విషయంపై గతంలో పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఏమైందనేది రెండు మూడు రోజుల్లో చెపుతాను.

Advertisement

తాజా వార్తలు

Advertisement