Sunday, March 26, 2023

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలి.. ఢిల్లీలో విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నిరసన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఛైర్మన్ రాజశేఖర్ న్యూఢిల్లీ ఆంధ్రపదేశ్ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ప్రైవేటీకరణను ఆపాలంటూ నినాదాలు చేశారు. అనంతరం రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్రాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు. అనేక మంది ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునేదే లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని రాజశేఖర్ వెల్లడించారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం దీక్షకు ఆయన మద్దతు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement