Thursday, April 18, 2024

ప్ర‌ధాని మోడీకి ముద్ర‌గ‌డ లేఖ‌… ఎందుకంటే…

మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ రాశారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనను కేంద్రం విరమించుకోవాలని లేఖ‌లో కేంద్రాన్ని కోరారు. ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితమే విశాఖ స్టీల్ ప్లాంట్ అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో అనేక చిక్కులు ఎదుర్కొవాల్సి వస్తుందని ముద్రగడ హెచ్చరించారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇతర పరిశ్రమలతో లింక్ పెట్టడం సరికాదని.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రత్యేకంగా చూడాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా ప్రైవేటీకరణ చేయడం తగదని ముద్రగడ అన్నారు. రైతులను దృష్టిలో ఉంచుకుని మూడు వ్యవసాయ భూములను రద్దు చేసినట్లే.. ఈ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆ ఆలోచనను విరమించుకోవాలని ఆయన కోరారు. తమ విజ్ఙప్తిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement