Friday, April 19, 2024

అనాథ‌లకు శ్రీవారి దర్శనం – టీటీడీ చైర్మన్ కు కృతజ్ఞతలు

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పెద్దమనసు చేసుకొని సొంత ఖర్చులతో 35 మంది అనాథ‌లకు శ్రీవారి దర్శనంతో పాటు గోల్డన్ టెంపుల్, కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తి ఆలయాల దర్శనం కల్పించారు. శ్రీకాకుళం జిల్లాలోని వావిళ్ల‌ వలస గ్రామంలో నివాసం ఉంటున్న పాలూరు సిద్ధార్థ్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిసి అనాథ‌లకి దర్శనం కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన ఆయన 35 మంది అనాథ‌లకు 50,000 రూపాయలు రైల్వే టికెట్ లకు డబ్బులు ఇచ్చారు. రేణిగుంటలో రైలు దిగిన వారికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి, ఈ నెల 3వ తేదీన తిరుమలకు తీసుకొచ్చారు.

తిరుమలలో సొంత ఖర్చులతో అద్దె గదులను భోజన వసతులను ఏర్పాటు చేశారు వైవీ సుబ్బారెడ్డి. వారికి స్వామివారి సర్వదర్శనం చేయించారు. శనివారం గోల్డన్ టెంపుల్ , కాణిపాకం, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారు, శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేయించారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని ఎన్నో సంవత్సరాలుగా ఆశ పడుతున్న తమకు మానవతా హృదయముతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ఈ సేవ ఎప్పటికీ మరువలేమని వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement