Saturday, December 7, 2024

Srisailam – శివ నామస్మరణతో మారు మోగుతున్న శ్రీశైల గిరులు

శ్రీశైలం (కర్నూలు బ్యూరో) కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకొని.. శ్రీశైలంలో కిక్కిరిసిన భక్తులు. సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలంకు తరలి వచ్చారు. పాతాళ గంగలో పవిత్ర స్నానాలు ఆచరించడం కనిపించింది. క్రమంలో పాతాళ స్నాన ఘట్టం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో కనిపించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు గావించారు. స్నాన ఘట్టం అనంతరం భక్తులు తమ ఇష్టా దైవమైన శ్రీశైల భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు.

దీంతో క్యూ లైన్ లలో పెద్ద సంఖ్యలో భక్తులు కనిపించారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు పాలు, ఇతర ఆహారాలను దేవస్థానం అధికారులు అందజేశారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులు స్వామి అమ్మవారి దర్శనానికి పోటెత్తడం గమనార్హం.

శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే

కార్తీకమాసంలో తొలి సోమవారం కావడంతో శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, అమ్మవార్లను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదర సత్కార్యముతో ఆహ్వానించారు. స్వామి అమ్మవాళ్ళు దర్శనానంతరం పూజ ప్రసాదాలు అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement