Thursday, April 18, 2024

ఉగాది వేడుకలకు సిద్ధమైన శ్రీశైలం.. విద్యుత్ కాంతుల‌తో మెరిసిపోతున్న గోపురాలు..

ఉగాది వేడుకలలో శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి ఆలయం ముస్తాబు చేశారు. ఆలయానికి సంబంధించి గోపురాలతో పాటు ఇరువైపులా విద్యుత్ అలంకరణ చేశారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ అలంకరణ లో శ్రీశైలం ప్రత్యేక ఆకర్షణగా చోటు చేసుకుంది. ఉగాది వేడుకల్లో భాగంగా తమ ఇంటి ఆడపడుచు అయినా శ్రీశైల భ్రమరాంబిక చీర, సారె సమర్పించేందుకు కన్నడ, మరాఠీ భక్తులు ఏటా భారీగా తరలి వస్తున్న సంగతి విధితమే. వందల కిలోమీటర్ల దూరంలో నున్న తమ ప్రాంతాల నుంచి కాలినడకన శ్రీశైలం చేరుకుంటారు. ఇప్పటికే శ్రీశైలంలో లక్షలాది మంది భక్తులు చేరుకున్నారు. తమ ఇష్టదైవం లైన మల్లికార్జున, భ్రమరాంబిక స్వామి వాళ్లను దర్శించుకుంటున్నారు. ఉగాది నాటికి శ్రీశైలంలోని స్వామి, అమ్మవారు లను దాదాపు 5 లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉంది.

గతంలో ఎన్నడూ లేనివిధంగా శ్రీశైలంలో ఏర్పాట్లపై ఆలయ ఈవో లవ్ అన్న ఆధ్వర్యంలో కర్ణాటక, మహారాష్ట్ర పరిధిలో మల్లన్నను విరివిగా భక్తితో కొలిచే ప్రాంతాలకు వెళ్లి ఈ ఏటా శ్రీశైలంలో గావించిన ఏర్పాట్లపై ప్రత్యేకంగా వివరించారు. ఆయా ప్రాంతాల భక్తమండలి కమిటీలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి, శ్రీశైలంలో ఏర్పాట్లపై వివరించడం జరిగింది. ఈ క్రమంలో అధికారులు కల్పించిన అవగాహనతో మరింత ఎక్కువ మంది భక్తులు శ్రీశైలం కు తరలి వస్తున్నారు. భక్తుల రాక దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు గావించారు. అంతేకాదు ఆలయంలో ప్రత్యేక విద్యుత్ అలంకరణ భావించడంతో శ్రీశైలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులలో భక్తి పారవశ్యాన్ని నింపుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement