Monday, November 11, 2024

Srisailam రిజ‌ర్వాయ‌ర్ లో చేప‌ల వేట నిషేధం..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – క‌ర్నూలు : శ్రీశైలం జలాశయ పరిసరాల్లో చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.ఈ మేర‌కు మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జులై, ఆగస్టులో చేపల సహజ సంతానోత్పత్తి సమయమని, ఈ సమయంలో శ్రీశైలం జలాశయం, బ్యాక్‌వాటర్స్‌లో చేపల వేట వద్దని ఆదేశించింది.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఆగిపోవటంతో మత్స్యకారులు పుట్టీలపై బయలుదేరి చేపలు వేటాడుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం నిలిచిపోవటంతో సోమవారం ప్రాజెక్టు గేట్లన్నీ మూసివేశారు. దీంతో డ్యాం దిగువన ఉన్న ప్లంజ్‌పూల్‌లో చేపలను పట్టుకునేందుకు కృష్ణాతీరంలోని పాతాళగంగ, లింగాలగట్టు గ్రామాల్లోని మత్స్యకారులు పుట్టీలపై బయలుదేరారు. ప్రాజెక్టు నుంచి దూకుతున్న నీటికి ఎదురెళ్లే పెద్ద చేపలు డ్యాం దిగువన ప్లంజ్‌పూల్‌లోకి చేరతాయి. వీటి కోసమే మత్స్యకారులు వలలతో వేట సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్సశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement