Monday, April 15, 2024

రైల్వే స్టేష‌న్ లో జింక‌..

ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లోకి ఉదయం జింక వచ్చింది.. దీనిని స్థానికుల సహకారంతో బంధించి రైల్వే స్టేషన్ లో భద్రపరిచారు.. అనంత‌రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సమాచారం ఇవ్వడంతో బీట్ ఆఫీసర్ టీ వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సూర్యనారాయణ లు వచ్చి, జింక తీసుకుని జలంతరకోట అరణ్యంలోకి విడిచి పెట్టారు. కాగా, మొదట్లో ఈ జింకను రైల్వేస్టేషన్లో భద్రపరచడానికి రైల్వే సిబ్బంది నిరాకరించారు. దీంతో పట్టణ ఎస్ఐ సత్యనారాయణ రైల్వే సిబ్బందితో మాట్లాడి స్టేషన్ లోని వెయిటింగ్ హాల్ లో భద్రపరిచారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement