Tuesday, April 23, 2024

జీడి మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి

శ్రీకాకుళం, : జీడీమామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని జీడి రైతులు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ పి.ఎస్.ప్రద్యుమ్నను కోరారు. జీడిమామిడి పంట, రైతుల సమస్యలు తెలుసుకొనుటకు జిల్లా పర్యటనకు విచ్చేసిన కమీషనర్ బుధ వారం వజ్రపు కొత్తూరు మండలం నీలావతి గ్రామాన్ని సందర్శించారు. జీడి పంట పరిస్ధితిని స్వయంగా పరిశీలించారు. అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖాముఖి పాల్గొన్నారు. జీడి రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదని, మార్కెట్ లోధర పెరిగినా తగ్గినా ఒకటే ధర చెల్లిస్తున్నారని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్ధానం (టిటిడి) జీడి పప్పును కొనుగోళు చేసే విధంగా చర్యలు చేపట్టాలని తద్వారా రైతులకు కొంత భరోసా కలుగుతుందని పేర్కొన్నారు. కోల్డు స్టోరేజి ఏర్పాటు చేయాలని కోరారు. జీడి పంటకు ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. జీడి పంటకు సరైన సాగు నీటి సదుపాయం లేదని – బోర్లు తదితర సౌకర్యాలు కల్పించడం వలన మరింత ఉత్పాదకత సాధించుటకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రైతుల సూచనలకు కమీషనర్ ప్రద్యుమ్న స్పందిస్తూ జీడి మామిడి రైతుల సమస్యలపై ముఖ్య మంత్రికి నివేదిక సమర్పిస్తామన్నారు. రైతులకు ప్రభుత్వం సహాయం అందించుటకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కోల్డు స్టోరేజి ఏర్పాటుకు తగిన ప్రయత్నం చేస్తామని కమీషనర్ అన్నారు. జీడి రైతులు రైతు ఉత్పాదక సంఘాలు (ఎఫ్.పి.ఓ)గా ఏర్పడి సంఘాలను రిజిస్టర్ చేయించుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, మార్కెంటింగు శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కె.శ్రీనివాస రావు, సహాయ సంచాలకులు బి.శ్రీనివాస రావు, కార్యనిర్వాహక ఇంజనీరు జయ శేఖర్, ఉద్యానవన సహాయ సంచాలకులు ఆర్.వి.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement