Tuesday, April 13, 2021

ఉద్యోగుల స్మార్ట్ కార్డుల పంపిణీ

శ్రీకాకుళం, : ఉద్యోగుల ఆరోగ్య స్మార్ట్ కార్డులను జిల్లాలో పంపిణీ ప్రారంభించారు. జిల్లాలో పంపిణీ ప్రారంభించినట్లు ఖజానా శాఖ ఉపసంచాలకులు పి.సావిత్రి తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఖజానాలో విశ్రాంత అధ్యాపకులు, యూజీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వి.జె. రాధా ప్రసాద్ కు డిజిటల్ స్మార్ట్ కార్డును ఉపసంచాలకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని ఖజానా కార్యాలయాలలో స్మార్ట్ కార్డులు పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే పంపిణీ ప్రారంభం అయిందని ప్రతి ఒక్కరూ ఈ కార్డులను పొందాలని ఆమె కోరారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News