Thursday, April 25, 2024

శ్రీ వేణుగోపాలస్వామి అలంకారంలో శ్రీనివాసుడు

శ్రీ వేణుగోపాల‌స్వామి అలంకారంలో చిన్న శేష‌వాహ‌నంపై ద‌ర్శ‌న‌మిచ్చారు శ్రీనివాసుడు. తిరుపతిలోని అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జ‌రుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. చిన్నశేష వాహనం దర్శనమివ్వడం పాంచభౌతిక ప్రకృతికి సంకేతమని, ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుందని అర్చకులు వెల్లడించారు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయస్కరమన్నారు. అదేవిధంగా నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మురళీ కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement