Friday, April 26, 2024

ఎన్టీఆర్ కి భారత రత్న?

కమలనాథుల సరికొత్త ఆలోచన
వాజ్‌పేయి నిర్ణయానికి కొనసాగింపే అంటున్న పార్టీ వర్గాలు

అమరావతి, ఆంధ్రప్రభ: ఈనెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భం గా రాష్ట్ర రాజకీయాల్లో పాగా వేసేందుకు భారతీయ జనతాపార్టీ పావులు కదుపు తోంది. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం భారత రత్న తో పాటు-గా పద్మ అవార్డులను ప్రకటించటం ఆనవాయితీ. ఈక్రమంలోనే రాష్ట్రానికి ఈసారి కమలం పెద్దలు ఒక విశిష్ట అవార్డును అందించేందుకు కసరత్తు చేస్తున్నారంటూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ ప్రారంభమైంది. అదే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నందమూరి తారక రామారావు అంశం. ఈయ నకు భారత రత్న ఇవ్వాలని ఎప్పటి నుండో డిమాండ్‌ ఉంది. అయితే, ఇప్పటివరకూ అది ఆచరణకు నోచుకోలేదు. అయితే, ఇప్పటికే ఏపీలో ఉన్న ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చిన అధికార వైకాపాకు, పార్టీ నెలకొల్పి అధికారంలోకి తీసుకొచ్చిన ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని చిత్తశుద్ధితో పనిచేయని టీడీపీకి ఒకే సారి చెక్‌ పెట్టేలా కమల దళం నేతలు చెక్‌ పెట్టనున్నారని అంటున్నారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వ డం ద్వారా ఏపీలో రెండో స్థానానికి ఎగబాకేందుకు ఒక మార్గం దొరుకుతుందన్న భావన కమలం బాస్‌ల ఆలోచ నగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019లో బెంగాల్‌ రాజకీయాల నేపథ్యంలో మాజీ రాష్ట్ర పతి ప్రణబ్‌ ముఖర్జీకి భారత రత్న ఇచ్చారనే అభిప్రాయం అప్పట్లో వినిపించింది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్‌ పెట్టిన బీజేపీ.. ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డుపై ఆలోచన చేస్తున్నట్లు- తెలుస్తోంది. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు కావటంతో కేంద్రం ఎటు-వంటి నిర్ణయం తీసుకుంటు-ందనేది చూడాలి. ఎన్టీఆర్‌కు అవార్డుకు వాజ్‌ పేయ్‌ ప్రభుత్వం అప్పట్లోనే సిద్దం కావటంతో, ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని అమలు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మూడు దశాబ్దాలైనా..చేరని ఆదరణ
ఎన్టీఆర్‌. అనే పేరే తెలుగు రాజకీయాల్లో ఓ సంచలనం. ఆయన మరణించి 27 ఏళ్లు అయినా ఇంకా తెలుగు ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనేది చిరకాల డిమాండ్‌. ప్రతీ ఏటా ఎన్టీఆర్‌ జయం తి, వర్దంతి రోజుల్లో నేతలు నివాళి అర్పించటం.. భారత రత్న ఇవ్వాలని డిమాండ్‌ చేయటం పరిపాటిగా మారింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై కన్నేసిన బీజేపీ దీనినే అస్త్రంగా మలచుకొనే వ్యూహాలతో సిద్దం అవుతోంది. కొద్ది రోజుల క్రితం జూనియర్‌ ఎన్టీఆర్‌తో అమిత్‌ షా భేటీ- ద్వారా తమ అజెండా అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్‌కు భారత రత్న అంశం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు- విశ్వ సనీయ సమాచారం. ఈ నిర్ణయం అమలు చేస్తే బీజేపీకి ఆక్రెడిట్‌ దక్కుతుందా. రాజకీయంగా బీజేపీకి కలిసి వస్తుందా..టీ-డీపీని ఆత్మరక్షణలోకి నెడుతుందా..ఏం జరుగుతోంది.. అనే అంశాలపై చర్చ ప్రారంభమైంది.
టీడీపీ స్థానం కోసమేనా?
తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో అధికారం దక్కించికుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. టీ-డీపీతో పొత్తు అంశాన్ని ఆ పార్టీ నేతలు కొట్టి పారేస్తున్నారు. పొత్తుల కారణంగానే ఇప్పటి వరకు నష్టపోయామని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో టీ-డీపీతో పొత్తు పెట్టు-కుంటే కేసీఆర్‌కు ఆయుధంగా మారుతుందని పార్టీ రాష్ట్ర నేతలు ఇప్పటికే హైకమాండ్‌కు నివేదించారని తెలుస్తోంది. ఏపీలో పొత్తు కారణంగా వచ్చే తక్షణ ప్రయోజనం కంటే..పార్టీ భవిష్యత్‌ కోసం సంస్థాగతంగా బలోపేతం కావటమే ముఖ్యమని ఢిల్లీ నేతలు తాజాగా ఏపీ నేతలకు స్పష్టం చేసారు. ఎలాగైనా టీ-డీపీ స్థానంలో తాము ఎదగాలనేది బీజేపీ ఆకాంక్ష. ఇందు కోసం వ్యూహాత్మకంగా అడుగులు ప్రారం భిస్తున్నట్లు- పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధాని మోదీ పలు సందర్భాల్లో ఎన్టీఆర్‌ను కీర్తించిన విషయం ఇక్కడ గమనించాల్సిన అంశంగా ఉంది.
ఎన్టీఆర్‌ పేరుపై వివాదం
రాష్ట్రంలో హెల్త్‌ వర్సిటీ-కి ఎన్టీఆర్‌ పేరు మార్చి వైఎస్సార్‌ పేరు చేర్చటంపైరాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. కొత్తగా ఏర్పాటు- చేసిన జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు ఖరారు చేయటం ద్వారా వచ్చిన ఇమేజ్‌ వర్సిటీ- పేరు మార్పుతో తగ్గిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇక, వాజ్‌ పేయ్‌ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్‌కు భారత రత్న గురించి చర్చ జరిగిందని తదనంతరం నెలకొన్న కొన్ని రాజకీఈయ పరిణామాల నేపథ్యంలోనే ఎన్టీఆర్‌కు అవార్డు దక్కలేదని నందమూరి కుటు-ంబాన్ని అభిమానించే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ వెల్లడించారు. ఇక వైసీపీ నేతలు సైతం పలు సందర్భాల్లో చంద్రబాబు సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటుపొడిచి అధికారంలోకి వచ్చారంటూ ఆరోపణలు కంటిన్యూ చేస్తున్నారు. దీనికి బాలయ్యతో నిర్వహించిన అన్‌ స్టాపబల్‌ షో ద్వారా చంద్ర బాబు క్లారిటీ- ఇచ్చే ప్రయత్నం చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement