Monday, October 14, 2024

Special Trains | పండుగ వేళ ప్ర‌త్యేక రైళ్లు.. వివ‌రాలివే !

రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి మరియు ఛత్ పండుగ సీజన్‌లో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి రైల్వే 10 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. వరుస పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా సర్వీసులను నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.

అలాగే వరదల కారణంగా రద్దు చేసిన పూరి- తిరుపతి, చెన్నై సెంట్రల్- ఎస్ఎంవీడీ కత్రా ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరించారు. విశాఖపట్నం – సికింద్రాబాద్ వన్‌వే ఏసీ ప్రత్యేక రైలు అందుబాటులోకి వచ్చింది.

పండుగ సీజన్‌లో ప‌ది ప్ర‌త్యేక రైళ్లు..

  • సికింద్రాబాద్ – విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07097 ) రైలు సెప్టెంబ‌ర్ 8 – డిసెంబ‌ర్ 1 వరకు అందుబాటులో ఉంటుంది.
  • విశాఖపట్నం-సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07098) రైలు సెప్టెంబ‌ర్ 9 – డిసెంబ‌ర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది.
  • సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07027) రైలు సెప్టెంబ‌ర్ 6 – న‌వంబ‌ర్ 29 అందుబాటులో ఉంటుంది.
  • బ్రహ్మపూర్ – సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07028) రైలు సెప్టెంబ‌ర్ 7 – న‌వంబ‌ర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.
  • భువనేశ్వర్ – బెలగావి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (02813) రైలు సెప్టెంబ‌ర్ 7 – న‌వంబ‌ర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.
  • బెలగావి-భువనేశ్వర్ వీక్లీ స్పెషల్ (02814) రైలు సెప్టెంబ‌ర్ 9 – డిసెంబ‌ర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది.
  • తిరుపతి- శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07440) రైలు అక్టోబ‌ర్ 10 – డిసెంబ‌ర్ 1 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది.
  • శ్రీకాకుళం రోడ్- తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07441) రైలు అక్టోబ‌ర్ 7 – డిసెంబ‌ర్ 2 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది.
  • నాందేడ్ – బెర్హంపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07431) రైలు అక్టోబ‌ర్ 12 – న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది.
  • బెర్హంపూర్‌- నాందేడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07432) రైలు అక్టోబ‌ర్ 13 – డిసెంబ‌ర్ 1 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది.

సర్వీసుల పునరుద్ధరణ..

  • వ‌ర‌ద‌ల కార‌ణంగా ర‌ద్దైన పూరీ- తిరుపతి ఎక్స్‌ప్రెస్ (17479) సెప్టెంబ‌ర్ 5 నుండి య‌థావిధిగా న‌డుస్తుంది. చెన్నై సెంట్ర‌ల్‌- ఎస్ఎంవీడీ కాట్రా ఎక్స్‌ప్రెస్ (16031)ను కూడా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే పున‌రుద్ధ‌రించింది.

ప‌లు రైళ్లు ర‌ద్దు..

  • హౌరా- మైసూర్ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (22817), విశాఖపట్నం- గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240), రాయగడ- గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17244), కొచ్చువేలి- షాలిమార్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06081) రైలును సెప్టెంబ‌ర్ 6 వ‌ర‌కు రద్దు చేశారు.
  • అదేవిధంగా కన్యాకుమారి – హౌరా సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (12666), తిరునెల్వేలి – పురూలియా సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (22606) రైలును సెప్టెంబ‌ర్ 7 వ‌ర‌కు రద్దు చేశారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement