Friday, December 6, 2024

AP | విశాఖ డైరీ అవినీతి విచారణకు ప్రత్యేక హౌస్‌ కమిటీ

విశాఖ డైరీ అవినీతి, అక్రమాలపై విచారణకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రత్యేక హౌస్ కమిటీని నియమించారు. నవంబర్ 20న శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో ఈ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు స్పీకర్ తెలిపారు.

ఈ కమిటీ చైర్మన్‌గా జ్యోతుల నెహ్రూ కాగా… సభ్యులుగా బొండ ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్‌.వి.ఎస్‌.కె.కె. రంగారావు, దాట్ల సుబ్బరాజులు నియమితులయ్యారు.

ఈ కమిటీ సమగ్ర విచారణ జరిపి, రెండు నెలలలోపు విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాల్సిందిగా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఇది ఒక కీలక అడుగుగా ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement