Thursday, April 25, 2024

స్పందన దరఖాస్తులను ఇన్​టైమ్​లో పరిష్కరించాలి.. లేట్​ చేస్తే సీరియస్​ యాక్షన్​ : కలెక్టర్​

జంగారెడ్డిగూడెం:  స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం డీసీసీబీ కల్యాణ మండపంలో మంగళవారం రెవెన్యూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ.. స్పందన కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందన్నారు.  స్పందన దరఖాస్తులు ఎట్టి పరిస్థితులలోనూ పెండింగ్ లో ఉండకూడదన్నారు. అనర్హుల దరఖాస్తును తిరస్కరించే సమయంలో అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలన్నారు.  వేసవిలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించాలన్నారు. 

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలపై కలెక్టర్ సమీక్షిస్తూ  నవరత్నాలు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని వాటిని అర్హులైన పేదలందరికీ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.  ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయవలసి బాధ్యత అధికారులపై ఉందన్నారు.  జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును మరింత వేగవంతం చేసేందుకు ప్రతీ నెలా డివిజన్ స్థాయిలో మండల స్థాయి అధికారులతో సమీక్షించడం జరుగుతుందన్నారు.  అధికారులు తమకు నిర్దేశించిన లక్ష్యాలను సాదించాల్సిందేనని, లక్ష్యసాధనలో వెనుకబడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement