Thursday, April 25, 2024

త్వరలో ఈ- ఫార్మర్‌ మార్కెట్‌.. వ్యవసాయోత్పత్తులను నేరుగా అమ్ముకునే చాన్స్..

రైతులు తమ ఉత్పత్తులను ఎప్పుడైనా, ఎవరికైనా, ఎంతకైనా అమ్ముకునే ఈ-ఫార్మర్‌ మార్కెట్‌ ప్లాట్‌ఫామ్‌ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. రైతులు పండించే వ్యవసాయ, ఉద్యాన పంటలకు ప్రభుత్వమే నాణ్యత సర్టిఫికెట్‌ అందించి ఈ-ఫార్మర్‌ మార్కెట్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఉత్పత్తులను అమ్మేందుకు ప్రోత్సాహకాలు అందించేలా ప్రణాళిక రూపొందించారు. నూతన వ్యవసాయ విధానంలో భాగంగా మార్కెటింగ్‌ మౌలిక వసతులు, బహిరంగ మార్కెల్లో గిట్టుబాటు ధరలు, లాభాల ఆర్జన లక్ష్యాలతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఒనగూరే ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ఈ విధానాన్ని వివిధ రాష్ట్రాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఏపీలోనూ చిత్తూరు, అనంతపురం, కర్నూల్‌, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన పైలట్‌ ప్రాజెక్టు సత్ఫలితాలనివ్వటంతో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు వ్యవసాయాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పైలట్‌ ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు రూ.4 కోట్లకు పైగా విలువైన 294 వ్యాపారలావాదేవీలను పూర్తి చేశారు. 108 వ్యాపారులు, 254 మంది వ్యాపారులు దీనిలో భాగస్వా మ్యులయ్యారు.

2022-23 ఆర్ధిక సంవత్సరంలో సుమారు 50 వేల మంది రైతులు, 10 వేల మంది వ్యాపారులు, రూ. 1000 కోట్ల వ్యాపారమే లక్ష్యంగా ఈ-ఫార్మర్‌ మార్కెట్‌ ప్లాట్‌ ఫామ్‌ను నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఈ-ఫార్మర్‌ మార్కెటింగ్‌ పేరుతో మొబైల్‌ యాప్‌ రూపొందిస్తోంది. తాము పండించిన వ్యవ సాయోత్పత్తులను తమకు గిట్టు-బాటయిన ధరలకు అమ్ముకునేందుకు రైతులు ఎలక్ట్రాన్రిక్‌ ట్రేడింగ్‌ పోర్టల్‌ లో నమోదు చేసుకోవాలి. పోర్టల్‌ లో నమోదు చేసుకున్న రైతుల ఉత్పత్తుల నిల్వలను భద్రపర్చేందుకు ప్రత్యేకంగా వేర్‌ హౌస్‌ లు కూడా నిర్మించనున్నారు. ఆ తరువాత వ్యవసా యోత్పత్తుల నాణ్యతపై నమూనా పరీక్షల ఆధారంగా ప్రభుత్వమే సర్టిఫికేట్‌ అందిస్తోంది. ఈ-ఫార్మర్‌ మార్కెట్‌ ప్లాట్‌ఫామ్‌ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement