Thursday, October 31, 2024

Kovvur : గ్యాస్ బండ‌తో అల్లుడి దాడి.. మామ మృతి, అత్త ప‌రిస్థితి విష‌మం

అల్లుడు గ్యాస్ బండ‌తో అత్త‌, మామ‌ల‌పై దాడి చేయ‌డంతో మామ మృతిచెంద‌గా, అత్త ప‌రిస్థితి విష‌మంగా ఉన్న ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో చోటుచేసుకుంది. ఆర్థిక వ్యవహారాల విషయంలో అత్తమామలతో ఘర్షణకు దిగిన అల్లుడు ఆగ్రహంతో వారిపై దాడి చేశాడు.

ఐదు కేజీల గ్యాస్ బండతో అత్తమామలను కొట్టడంతో మామ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. తీవ్ర గాయాల పాలైన అత్తను స్థానికుల సహాయంతో 108లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు అత్తామామలైన బేబీ(61), రాయoకుల శ్రీ రామకృష్ణ (62)లు.. దొమ్మేరు సావరానికి చెందిన అల్లుడు నందిగం గోపి(42)కి మధ్య ఆర్థిక వ్యవహారాల విషయంలో వివాదం చెలరేగడంతో ఈ దారుణం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement