Sunday, March 24, 2024

బిజెపికి మ‌ద్ద‌తు ఇవ్వండి – మోహ‌న్ బాబుని అభ్య‌ర్ధించిన‌ సోము

తిరుప‌తి – రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టిస్తున్న బిజెపి ఎపి శాఖ అధ్య‌క్షుడు సోము వీర్రాజు నేడు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుతో భేటి అయ్యారు.. తిరుప‌తిలోని మోహ‌న్ బాబు నివాసానికి ఆయ‌న వెళ్ళారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మోహ‌న్ బాబుని దుశ్శాలువ‌తో సత్క‌రించారు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మోహన్ బాబును వీర్రాజు కోరారు.అనంతరం మీడియాతో సోము వీర్రాజు మాట్లాడుతూ… బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్త ల‌ స్పందిస్తూ. రణ్ కుమార్ రెడ్డి చాలా చురుకైన వ్యక్తి అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement