Tuesday, October 8, 2024

AP | బెంగళూరు-గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు…

విశాఖలో బెంగళూరు – గౌహతి ఎక్స్ ప్రెస్ రైలు పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సింహాచలం చేరుకునే సమయానికి ఎస్ 7 బోగిలో ఒక్కసారిగా పొగ రావటంతో అప్రమత్తమయ్యారు. సింహాచలంలో బెంగళూరు – గౌహతి ఎక్స్ ప్రెస్ రైలు నిలిపివేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు స్పందించారు. S7 బోగీ చక్రాల వద్ద పొగ వచ్చింది. సాంకేతిక లోపంతో బ్రేక్ వద్ద పొగలు వచ్చాయని తెలిపారు. ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చిన అనంతరం సింహాచలం స్టేషన్ నుంచి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ గౌహతి వైపు బయలుదేరింది. అయితే ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు అని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement