Tuesday, March 26, 2024

మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ…

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు మహిళల జీవనోపాధి, వ్యాపార అభివృద్ధి కోసం నైపుణ్య, వ్యాపార మెళుకువలపై మైక్రోసాఫ్ట్‌ సహకారంతో నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణా కార్యక్రమం చేపట్టినట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ రాష్ట్ర ఎండీ ఎస్‌.సత్యనారాయణ తెలిపారు. డిజిటల్‌ ప్రొడక్టవిటీ, బేసిక్‌ ఇంగ్లీష్‌, ఎంప్లాయబిలిటీ, ఎంటప్రెన్యుయర్‌షిప్‌పై 30 రోజుల కాల వ్యవధితో కూడిన ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

శిక్షణ పొందిన వారికి మైక్రోసాఫ్ట్‌ సహకారంతో సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. 16 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళలు మాత్రమే శిక్షణ కోసం పేర్లు నమోదు చేసుకోవాలని, అవసరమైన సమాచారం కోసం నైపుణ్యాభివృద్ధి సంస్థ కాల్‌ సెంటర్‌ 99888-53335లో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement