Wednesday, November 13, 2024

AP: సీతారాం ఆలోచ‌న‌లే ప్ర‌త్యేకం.. చంద్ర‌బాబు

అమరావతి: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మ‌ర‌ణం ప‌ట్ల‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏచూరి భారతదేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ఒకరని తెలిపారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏచూరి ఎదిగారని గుర్తుచేసుకున్నారు.

ఆయన ఆలోచనలు సీపీఎం పార్టీకి ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయన్నారు. ఏచూరి కుటుంబ సభ్యులు, సహచరులు, అనుచరులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా, ఏచూరి కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాడ‌, సానుభూతి తెలిపేందుకు చంద్ర‌బాబు నేటి రాత్రికి ఢిల్లీ వెళ్ల‌నున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement