Thursday, April 18, 2024

స‌ర్వపాపహ‌ర‌ణం – రేపు అప్ప‌న్న నిజ రూప ద‌ర్శ‌నం

విశాఖ బ్యూరో…- నిరంతరం చందనంలో కొలువుండే సింహాద్రి నాథుడు ఏడాదికి ఒక్కరోజు మాత్రమే తన నిజ రూపదర్శనం భక్తులకు గావిస్తారు. వైశాఖ శుద్ధ తదియ నాడు తన దివ్యమైన నిజరూపాన్ని చందనం లేకుండా భక్తులకు ప్రసాదించి, తనకు జరగాల్సిన అన్ని పూజలు, అభిషేకాలు ఒక్కరోజులోనే జరిపిం చుకుని రాత్రికి గొప్పగా సహస్రఘటాభిషేకాన్ని పూర్తి చేసుకుని తిరిగి చందనదారుడు కానున్న అప్పన్న చందనోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూరూ రవ చక్రవర్తుల కాలం నుంచి నేటి వరకు క్రమం తప్ప కుండా సింహగిరిపై చందనోత్సవం వైభవంగా కొన సాగుతూ వస్తుంది. తన చల్లని చూపులతో భకు ్తలపై కరుణా కటాక్షాలు ప్రసరింపజేసి నిరంతరం వారికి అండగా ఉంటూ కాపాడుతారని భక్తకోటికి అపారమై న నమ్మకం. తన ఉగ్రరూపాన్ని తనలోనే దాచిపెట్టు కొని బయటకు మాత్రం చందనదారిగా దివ్యదర్శనం ఇచ్చే ఆ సింహాద్రినాథుడి మహిమలు ఎన్నో ……
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు అయిన సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీనృ సింహస్వామి నిజరూపదర్శనం ఉత్సవాన్ని శుక్ర వారం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఏడాది పొడవునా సుగంధభరిత చందనంలో ఉండే స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే భక్తులకు తన నిజరూపదర్శనం గావిస్తారు. దీనినే భక్తులంతా చంద నోత్సవంగా, చందనయాత్రగా పిలుస్తారు. పురాణ ఇతిహాస కథనాల ప్రకారం చందనోత్సవం ఆలయ చరిత్రలో అత్యంత ప్రాచుర్యం పొందింది.
పూర్వం పురూరవ చక్రవర్తి ఊర్వశితో కలిసి పుష్పక విమానంపై విహరిస్తుంటారు. అయితే ఆ విమానం సింహగిరిపైకి రాగానే ఆగిపోతుంది. అయితే ఊర్వశి దేవకన్య కావడంతో తన దివ్యదృష్టితో నిశితంగా పరిశీలించి ఇది అత్యంత మహిమాన్వితమైన సింహ గిరి పర్వతమని పురూరవ చక్రవర్తికి చెబుతుంది. దీంతో ఆ రోజు వారు అక్కడే బసచేయగా రాత్రికి సిం హాద్రినాధుడు పురూరవ చక్రవర్తి కలలో సాక్షాత్క రించి తాను ఇక్కడే ఒక పుట్టలోయలో ఉన్నానని, కావున తనను వెలికితీసి గొప్ప ఉత్సవం నిర్వ హించాలని ఆదేశిస్తారు. దీంతో తక్షణమే పురూరవ చక్రవర్తి స్వామివారి కోసం సింహగిరి లోయల్లో వెతు కులాట ప్రారంభిస్తారు. అయినప్పటికి కానరాక పోవడంతో మరోసారి పురూరవ చక్రవర్తికి తాను ఎక్కడ ఉన్నది స్వామి స్పష్టంగా చెబుతారు. దీంతో మరుసటిరోజు పురూరవ చక్రవర్తి స్వామి విగ్రహాన్ని ఒక 12 అడుగుల పుట్టలోయలో నుంచి వెలికితీస్తాడు. ఆ తరువాత స్వామి ఆదేశించిన ప్రకారం అత్యంత గొప్పగా చందనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలా నాటి పురూరవ చక్రవర్తుల కాలం నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా ఈ చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. స్వామి విగ్రహం 12 అడుగుల పుట్టలో నుంచి వెలికి తీసినందుకు గాను స్వామిపై 12 మణుగుల చందనం నిత్యం ఉంటుంది. అంతేకాకుండా స్వామి నిజ రూపాన్ని నిరంతరం భక్తు లు చూడకుండా ఏడాదికి ఒక్కరోజు మాత్రమే స్వామి ఆదేశించిన ప్రకారం వైశాఖ శుద్ధ తదియనాడు మాత్ర మే భక్తులకు దర్శనం గావిస్తారు. ఆ తరువాత మిగిలిన ఏడాది పొడవునా స్వామి ఎల్లప్పుడూ నిండు చందనంతో చల్లగా ఉంటూ ప్రజలను సుభిక్షంగా కాపాడు తారన్నది అప్పన్న భక్తుల అపార నమ్మకం.
చందనం విసర్జన: ఈ ఏడాది శుక్రవారం తెల్లవారు జామున 1.30 గంటలకు సుప్రభాత సేవ ప్రారం భమవుతుంది. ఆ తరువాత విశ్వక్షేణ, పుణ్యా హవచనం అనంతరం స్వామిదేహం పైన ఉన్న చంద నాన్ని బంగారు, వెండి బొరిసెలుతో తొలగిస్తారు. ఆ తరువాత వేద మంత్రోశ్చరణల నడుమ, మృదు మధుర మంగళవాయిద్యాల మధ్య స్వామి దేహానికి పూర్తిగా పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. ఆ తరువాత స్వామి దేహం, ఆ తరువాత స్వామి శిరస్సు, ఎదపైన రెండు పచ్చిచందనం ముద్దలు ఉంచి, పం చకలశ ఆరాధనగావిస్తారు. అనంతరం తొలి దర్శ నాన్ని పూసపాటి వంశీయులకు కల్పిస్తారు. ఆలయ చైర్‌పర్సన్‌ హోదాలో సంచయిత గజపతిరాజు స్వామిని తొలుత దర్శించుకోనున్నారు. కోవిడ్‌ నిబంధనల కారణంతో భక్తులెవరినీ అనుమతించడం లేదు.
సహస్ర ఘటాభిషేకం: చందనోత్సవంలో భాగంగా సాయంత్రం 5 గంటల తరువాత సింహాద్రినాథుడికి గొప్ప సహస్రఘటాభిషేకాన్ని నిర్వహించనున్నారు. గంగధార నుంచి పవిత్ర జలాలు ఋత్విక్‌లు తీసుకు వచ్చి ఆ తరువాత వివిధ రకాల ఫలపుష్ప శీతలా దులతో కూడిన సహస్రఘటాభిషేకాన్ని నిర్వహిం చనున్నారు. అంతకు ముందు కలశవాహన పూజాది కార్యక్రమాలను వైభవంగా జరిపించనున్నారు. ఇక రాత్రికి ముందుగా నిర్ణయించిన శుభముహుర్తాన తొలివిడతగా సింహాద్రినాథుడికి మూడు మణుగుల పచ్చి చందనాన్ని సమర్పించనున్నారు. దీంతో నిజ రూపంలో ఉన్న స్వామి తిరిగి నిత్యరూపంలోకి వస్తారు. ఉదయం నుంచి స్వామి దేహంపై చందనం లేకపోవడం వల్ల ఉదయం జరగాల్సిన బాలబోగం, రాజబోగం కార్యక్రమాలను రాత్రికి నిర్వహిస్తారు. అంటే చందనం లేకుండా స్వామి ఏమీ తినరన్నది పురాణ ఇతిహాస కథనాలు చెబు తున్నట్లు ఆలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆలయ ఇవో ఎం.వి. సూర్యకళ ఆధ్వర్యంలో చందనోత్సవానికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పా ట్లు చేశారు. ఏకాంతంగానే ఉత్స వం నిర్వహిస్తున్నప్పటికి స్వామి కి అన్ని సేవా కార్య క్రమాలు యథాతధంగా నిర్వహించ నున్నారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజాది కార్య క్రమాలు జరపనున్నారు. ఇప్పటికే తొలివిడత చందన సమర్పణకు అవసరమైన 125 కేజీలు పచ్చి చంద నాన్ని సిద్ధం చేశారు. వాటిలో బుధవారం సుగంధ ద్రవ్యాలు మిలితం చేసి చందనాన్ని ఆలయ బాండా గారంలో భద్రపరిచారు. మరో వైపు సహస్రఘ టాభిషేకానికి కలశాలు సిద్ధం చేస్తున్నారు. కోవిడ్‌ నేప థ్యంలో బయటి అర్చకులను గాని, ఇతర దేవాల యాల సిబ్బందిని కాని వినియోగించడం లేదని ఆలయ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. సింహ గిరిపైకి అనుమతిలేని వ్యక్తులు రాకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు పరిమిత సంఖ్యలో పాస్‌లను జారీ చేశారు. గత ఏడాది కొంత మంది అనధి కారికంగా దర్శించుకున్నారని, ఈ ఏడాది మరింత పటిష్టంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, శాసనసభ్యలు, ధర్మకర్తల మండలి సభ్యులు ఇలా ఎవరికి అనుమతి కల్పించకపోగా భక్తులకు స్వామిని దర్శించుకునే అకాశం లేదు. గత ఏడాది, ఈఏడాది కూడా వరుసుగా రెండేళ్లు ఆ చందన స్వామిని దర్శించుకోకపోవడం పట్ల పలు వురు భక్తులు తీవ్ర నిరాశతో ఉన్నారు. చందన స్వామి నిదర్శించుకుంటే సర్వపాపాలు హరించుకు పోయి ఆయా భక్తుల కుటుంబాలు సుఖ సంతోషాలు, భోగ బాగ్యాలుతో కలకాలం చల్లగా ఉంటారన్నది భక్తకోటి ప్రగాడ విశ్వాసం.

Advertisement

తాజా వార్తలు

Advertisement