Thursday, April 18, 2024

షూటింగ్ బాల్ ఛాంపియన్ షిప్ లో..శ్రీ ప్రకాష్ విద్యార్థినికి ప్రథమస్థానం..

తుని : నేషనల్ సౌత్ జోన్ షూటింగ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల విద్యార్థిని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచింది. శ్రీ ప్రకాష్ అనుబంధ సంస్థ అయిన ..స్పేసెస్ డిగ్రీ కళాశాల విద్యార్థిని వి. లీలారాణి చిత్తూరు జిల్లా, మదనపల్లి లో జరిగిన నేషనల్ సౌత్ జోన్ షూటింగ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొని ప్రధమ స్థానం సాధించింది. ఈమె గతంలో వాలీబాల్ .. షూటింగ్ బాల్ లో 8 గోల్డ్ మెడల్స్ సాధించిందని, భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని శ్రీ ప్రకాష్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వీర్రాజు తెలియజేశారు. నేషనల్ సౌత్ జోన్ షూటింగ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని లీలారాణి ని కళాశాల సంయుక్త కార్యదర్శి సి.హెచ్ విజయ్ ప్రకాష్ , వైస్ ప్రిన్సిపాల్ పి.సుబ్బారావు, అధ్యాపక బృందం అభినందనలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement