Wednesday, November 6, 2024

SHAR – ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్ ప్రయోగం విజయవంతం

ఆంధ్రప్రభ స్మార్ట్ – శ్రీహరికోట – వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనతను సాధించింది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఎస్ఎస్ఎల్వీ డీ3ని విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. విపత్తుల సమయంలో ఈ ఉపగ్రహం కీలక సమాచారాన్ని పంపిస్తుంది. ప్రకృతి విపత్తులతో పాటు అగ్ని పర్వతాలను కూడా ఈ శాటిలైట్ పర్యవేక్షిస్తుంది. మొత్త 17 నిమిషాల పాటు రాకెట్ ప్రయోగం కొనసాగింది.

ఈవోఎస్ శాటిలైట్ ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో అభివృద్ధి చేశారు. ఈ ఉపగ్రహంలో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ లో చిత్రాలను తీస్తుంది. ఈ శాటిలైట్ పంపించే సమాచారం విపత్తు నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఉపగ్రహం ఏడాది పాటు పని చేస్తుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement