Thursday, April 25, 2024

Kurnool: ఆయువుకు భరోసా.. తీరనున్న ఆక్సిజన్ కష్టాలు

కోవిడ్ మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. పకడ్బందీగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో సకల వసతులను సమకూరుస్తుంది. అందులో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చి కరోనా మహమ్మారి బాధితులకు ఆయువు పోసేందుకు చర్యలు చేపట్టింది. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణకు వేలాది మంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రోగి శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు క్షీణించిన నేపథ్యంలో ప్రాణవాయువు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ సిలిండర్లను నింపుకునేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ఆక్సిజన్ సిలిండర్లు లారీలను తరలించిన పరిస్థితులు కనిపించాయి.

కరోనా మొదటి, రెండు వేవ్ లో తలెత్తిన విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని థర్డ్ వేవ్ లో ఎలాంటి ఉపద్రవాలు వచ్చిన ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రాణవాయువు ఉత్పత్తికి శ్రీకారం చుట్టి ఆక్సిజన్ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చి థర్డ్ వేవ్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది.

రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జిజిహెచ్) కర్నూలులో 1000 లీటర్ల సామర్థ్యం 2, నంద్యాల జిల్లా ఆస్పత్రి 500 లీటర్ల సామర్థ్యం 1, ఏరియా హాస్పిటల్ బనగానపల్లి 500 లీటర్ల సామర్థ్యం 1, ఏరియా హాస్పిటల్ ఎమ్మిగనూరు 500 లీటర్ల సామర్థ్యం 1, ఎం సి హెచ్ ఆదోని 500 లీటర్ల సామర్థ్యం  1, ఏరియా హాస్పిటల్ ఆదోని 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ లు రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. కేంద్ర ప్రభుత్వ నిధులతోప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జిజిహెచ్) కర్నూలులో వెయ్యి లీటర్ల సామర్థ్యం 1, ఏరియా హాస్పిటల్ ఆదోని 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ఉత్పత్తి చేసే జనరేషన్ ప్లాంట్ లు కలవు.

దాతల సహకారంతో పిఎస్ ఏ ప్లాంట్ లు:

సి ఎస్ ఆర్ ఫండ్స్ దాతల సహకారంతో నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో 1000 లీటర్ల సామర్థ్యం 1, 330 లీటర్ల సామర్థ్యం 1, డోన్ 500 లీటర్ల సామర్థ్యం 1, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జిజిహెచ్) కర్నూలులో 330 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ఉత్పత్తి చేసే జనరేషన్ ప్లాంట్ లు నెలకొల్పారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి  కర్నూలులో ఎల్ ఎం ఓ ట్యాంకులు 2, నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఎల్ ఎం ఓ ట్యాంకు 6 కె ఎల్ 1 ఇదివరకే నెలకొల్పగా, నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఎల్ ఎం ఓ ట్యాంకు 10 కె ఎల్ అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

- Advertisement -

ప్రైవేట్ హాస్పిటల్ లో పి ఎస్ ఏ ప్లాంట్లు

50 నుంచి 100 పడకల ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కు రాష్ట్ర ప్రభుత్వం పి ఎస్ ఏ ప్లాంట్లు నెలకొల్పడానికి 30 శాతం సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించింది. అందులో అమీలియా హాస్పిటల్ 1, మెడి కవర్ హాస్పిటల్ 1, నోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 1, సంజీవిని హాస్పిటల్ 1, ఓమిని హాస్పిటల్ 1, ఉదయనంద్ హాస్పిటల్ నంద్యాల 1, విశ్వభారతి మెడికల్ కాలేజ్ 1, కిమ్స్ రెయిన్బో హాస్పిటల్ 1, మొత్తం 8 పి ఎస్ ఏ ప్లాంట్లు నెలకొల్పారు. ఎల్ ఎం ఓ ప్లాంట్ లు సంబంధించి శాంతిరాం మెడికల్ కాలేజ్ నంద్యాల 1, ఉదయనంద్ హాస్పిటల్, నంద్యాల 1, విశ్వభారతి మెడికల్ కాలేజ్ 1 మొత్తం 3 ఎల్ ఎం ఓ ప్లాంట్ లు నెలకొల్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement