Friday, December 6, 2024

టీడీపీ పై కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

తెలుగుదేశం పార్టీపై ఏపీ మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు. నారా లోకేశ్ కు అడ్డు వస్తారనే జూనియర్ ఎన్టీఆర్ ను పాతాళానికి తొక్కేస్తున్నారని ఆరోపించారు. లోకేశ్ ను ప్రజలపై రుద్ది ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు డీఎన్ఏను నాశనం చేసి రాజకీయ సమాధి కట్టాలని చెప్పారు. బీసీలే ఎన్టీఆర్ డీఎన్ఏ అని, ఏపీలో బీసీలను సమూలంగా నాశనం చేసే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement