Friday, March 31, 2023

పొదుపు మహిళల కార్పొరేట్ కళాశాల…..

కర్నూల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో కనిపించడానికి రాజమహాల్‌గా రాజభవనం , యూనివర్శిటీ- భవనం అంతకన్నా కాదా.. అది దేశ పౌరులను తీర్చిదిద్దే ఒక దేవాలయం…. లాంటి పాఠశాల. జిల్లా కేంద్రములో ప్రైవేట్‌ కార్పొరేట్‌ వర్గాలు నిర్మించిన భవనం కానేకాదు. కర్నూలు జిల్లా కేంద్రానికి 22కి.మీ దూరంలో ఓర్వకల్లు గ్రామశివార్లలో పోదుపులక్మి మహిళలు నిర్మించుకొన్న భవనము. పెద్ద పెద్ద నగరాలల్లో కార్పొరేట్‌ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోకుండా సకల సౌకర్యాలతో పాటు- అత్యాధునిక వసతులతో నిర్మించిన ఇంగ్లీషు మీడియం స్కూలు భవనంను వీరు నిర్మించుకొన్నారు. ఈ స్కూలు మెదట ప్రాధాన్యతగా మండల పరిధిలోని 27 గ్రామాలల్లో తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు ఉచిత విద్యా భోధన అందించటం, మిగిత పిల్లలకు అతి తక్కువ ఫీజుతో కార్పొరేట్‌ విద్యను బోధిస్తున్నారు. ఈ స్కూలు నిర్మించటం వెనుక ఎంతో శ్రమ ఉంది. పేదరికంతో పూటగడవని స్టితిలో కాయకష్టం చేసి రూపాయి, రూపాయి కూడబెట్టి పోదుపు సోమ్ముపై వచ్చిన వడ్డీతోపాటు-, సిఆర్‌పి ఇతర రాష్ట్రాలల్లో పొదుపు ఉద్యమంపై మహిళలను చైతన్యపరిచే కార్యక్రమాల్లో పాల్గొన్నప్పడు ఇచ్చే హానిరోయం డబ్బుతోపాటు- మహిళల శ్రమదానం రూ.7 కోట్లతో ఈ కార్పొరేట్‌ స్థాయి స్కూలోని నిర్మించుకోవడం జరిగింది.

- Advertisement -
   

పాఠశాల ఏర్పాటు వెనుక పొదుపు మహిళల కన్నీటి కష్టాలు:
ఈ స్కూల్‌ ఏర్పాటు- వెనుక పొదుపు మహిళ కష్టం ఎంతో దాగి ఉంది. వారి కష్టాన్ని వింటే కన్నీళ్లు అగవు. అక్షరం ముక్క రాకపోయినా పొదుపు సంఘం నిర్మించడం, మహిళలను చైతన్యపరచటం, ఆర్ధిక పరిపుష్టి కల్పించటం, అడది అంటే అబల కాదు సబల అని నిరూపించిన గోప్ప చరిత్ర వీరిది. వీరిని అన్ని విధాలుగా తీర్చిదిద్ది.. మార్గదర్శకంగా నిలిచిన వ్యక్తి, అమ్మగా
పిలవబడే ఓర్వకల్లు మండల పోదుపు లక్ష్మి ఐక్య సమాఖ్య గౌరవ సలహాదారురాలు విజయభారతికే దక్కుతుంది. 1995లో ఓర్వకల్లు మండల పోదుపు లక్ష్మి ఐక్య సమాఖ్య గౌరవ సలహాదారు విజయ భారతి పోదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మెదట 30 సంఘాల గ్రూపులతో ప్రారంభించి, నేడు 1000 పోదుపు సంఘాలను ఎర్పాటు- చేయించి, మిగతా పోదుపు సంఘాలకు మార్గదర్శకంగా నిలిచారు. పొదుపు జీవితాన్ని మార్చివేస్తుం దంటారు.. జీవితాన్ని కాదు జీవితాల్ని మార్చేసింది. ఒకటికాదు, రెండు కాదు ఏకంగా 27 గ్రామాల్ని సమూలంగా మార్చేసింది. సంఘాల్ని ఏర్పాటు-చేసిన మెదట్లో కుటు-ంబ కట్టు-బాట్లు-, భర్తల నుంచి వ్యతిరేకత మొదలయ్యాయి. బంధువులు హేళనలను ఎదుర్కున్నారు. అయితే ఇవేవి పట్టించుకోకుండా లక్ష్యం వైపు దష్టిసారిస్తూ..మహిళా బ్యాంకు ఏర్పాటు-చేసు కొన్నారు. మెదట్లో పోగైన సోమ్ములో నుంచి అవసరమైయి వారికి అప్పులు ఇచ్చారు. ఒక్కొక్క సంఘాల సంఖ్యను బట్టి ఒక్కొక్క గ్రామానికి రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల వరకు రుణపరపతి కల్పించారు. భూమి పథకం పేరుతో వందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.

అదరణ లేని మహిళలకు అర్ధిక సహాయం అందించారు. ఇలా పోదుపు సోమ్ముతో తమ జీవితాలే మారి పోవ డంతో వారికి కొండంత నమ్మకాన్ని కలిగించాయి. నిరుపేదలను గుర్తిం చటం, గుర్తించబడ్డ వారిని సంఘటితం చేయడం. పోదుపుసంఘాల నిర్వ హాణకు అనువైన వాతవర ణాన్ని కల్పించడం. మహిళల్లో నాయకత్వ సామర్థ్యాన్ని పెంపోదించడం, సభ్యుల భాగ స్వామ్యాన్ని మరింత పెంచడం, ఇక జీవనోపాధికి అవసరమైన పెట్టు-బడి అందించడం, అవసరమైయితే ఉపాధి మార్గాలను సూచించడం వంటివి చేస్తూ వ్చారు. ఇక బాల కార్మిక వ్యవస్ట నుంచి విముక్తి పోంది భవిత పాఠశాలలో అక్షరాలు నేర్చుకొన్నవారిలో ఎందరో ఉన్నత స్టాయిలో స్టిరపడ్డారు. వారిలో 600 మంది పేదరిక నిర్మూలన అవగాహాన కార్యక్రమాలల్లో పాల్గోంటు-న్నారు.ఇంతటి ప్రగతి సాధించిన ఓర్వకల్లు పోదుపుమ హిళలు దేశవిదేశాలకు అదర్శంగా నిలిచారు..

నిర్మాణంలోను శ్రామికులే:
ఈ స్కూళ్లు భవన నిర్మాణాన్ని 7 ఎకరాల విస్తీరణములో 2006లో మెదలు పెట్టారు. అంచెలు అంచెలుగా నిర్మాణాలను పూర్తిచేసుకొంటూవెళ్లారు. ఈ భవన నిర్మాణంలో -టె-క్నికల్‌ లేబర్‌ మినహా యిస్తే, మిగిలిన పనులల్లో పోదుపుసంఘం మహిళల కుటు-ంబ సభ్యులే పాలుపంచుకొన్నారు. 27 గ్రామాలకు చెందిన ఒక్కొక్క కుటు-ంబం నుంచి కనీసం ముగ్గురు చొప్పన రోజువారీగా వచ్చి భవన నిర్మాణంలో శ్రమదానం చేశారు. మొత్తం 3 అంతస్తులల్లో ఒక్కొక్క అంతస్తులో 20 గదులు చొప్పున మొత్తం 60 గదులు నిర్మించుకొన్నారు. 10 సంవత్సరాలపాటు- శ్రమించి 2016లో పూర్తిచేసుకొన్నారు. రూ. 7 కోట్లతో మూడు అంతస్తులతో రాజ్‌ మహాల్‌లా ఠీవీగా నిర్మించుకొన్నారు. మొత్తం 712 మంది విద్యార్ధిని విద్యార్థుల్లో నర్సరీ నుంచి 10 వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో ప్రస్తుతం బోధన జరుగు తుంది. వీరి కొసం 30 మంది అర్హులైన ఉపాధ్యా యులను నియమించారు. మండల పరిధిలోని 27 గ్రామల విద్యార్థులు స్కూళుకు చేరుకొవటానికి 9 బస్సుల సౌకర్యం కల్పించారు.. ఇక మౌళిక సదుపాయాలను పరిశీలిస్తే. ఇంటర్‌ నెట్‌, డిజిటల్‌ ల్యాబ్‌, నాన్‌ డిజిటల్‌ ల్యాబ్‌, సైన్స్‌ ల్యాబ్‌, జూమ్‌ ల్యాబ్‌ ద్వార విద్యార్థులకు మెటేవేషన్‌ క్లాసులు, కంప్యూటర్‌ క్లాసులు, మ్యూజిక్‌ కొసం ప్రత్యేక హాల్‌, యెగా తదితర సౌకర్యాలన్ని ఎర్పాటు-చేశారు. అమెరికాలో నివసిస్తున్న పోట్లూరి రవి అనే వ్యక్తి వీరిస్కూల్లో అక్వావాటర్‌ సప్లయి ప్లాంట్‌, విద్యార్థులకు అవసరమైన యూనిఫాంలు అందిస్తూ తన సహాయ సహాకారాలు అందిస్తు న్నారు. కార్పొరేట్‌ స్టాయి విద్యను బోధిస్తున్న ఈ స్కూల్‌లో తల్లిదండ్రులు లేని అనాధలకు 100 మంది విద్యార్ధులకు ఫ్రీ గా అడ్మిషన్లు ఇవ్వటంతోపాటు-, వారికి అవసరమైయిన బుక్స్‌, అన్ని సమకూరుస్తున్నారు. మిగిలిన విద్యార్ధులకు అతి తక్కువఫీజుతో విద్యాభోదన జరగుతుంది. లాభపేక్ష అశించకుండా విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం విశేషం. ఇక వీటిలో విద్యనభ్యసిం చిన విద్యార్థులు ఎందరో డాక్టర్లు, సాప్టువేర్‌ ఇంజనీర్లు, ఉపాధ్యా యవృత్తితోపాటు-,, పోలీస్‌, వైద్యశాఖలో స్టిరపడ్డవారు లేకపోలేదు.

యూనివర్శటీ స్థాయికి తీసుకెళ్తాం : ఐక్య సమాఖ్య గౌరవ సలహాదారు విజయభారతి

ఈ పాఠశాలకు యాజమాన్య మంటూ లేదు. పది వేల మంది పొదుపు మహిళలే వీటికి యజమానులే. అందుకే వీరు ఎన్నుకున్న కమిటే ఏ నిర్ణయమైన తీసుకుంటు-ంది. కమిటీ- ఆధ్వర్యంలోనే పాఠశాల పని చేస్తుందని, ఇక్కడ పోదుపు సంఘాల మహిళలకు అమ్మగా, స్కూళు విద్యార్ధులకు అమ్మమగా పిలవబడే ఓర్వకల్లు మండల పోదుపు లక్ష్మి ఐక్య సమాఖ్య గౌరవ సలహాదారురాలు విజయభారతి అంటారు. ఈమె కృషి, పట్టు-దలతో ఇంతటి స్టాయికి చేరుకొన్న ఈ స్కూళు..రాబోయే రోజుల్లో యూనివర్శిటీ-గా మార్చాలని యెచిస్తున్నారు. వారి అశయాలకు అందరు అండగా నిలవాలని కొరుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement