Saturday, April 20, 2024

పుణ్య‌క్షేత్రాల్లో సెక్యూరిటీల‌ కీచకత్వం..

కర్నూలు, ప్రభన్యూస్‌: పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కొందరు సెక్యూరిటీ- గార్డుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. శ్రీశైలం, సుండిపెంటకు చెందిన విద్యార్ధినీల మెయిల్‌ ఐడీలు హ్యాకింగ్‌ చేశారు. వారి ఫేస్‌ బుక్‌ లో అమ్మాయిల ఫోటోలు సేకరించి వారిని వేధిస్తున్నారు. అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడుతూ కీచకపర్వం సాగిస్తున్నారు. డబ్బు ఆశ చూపిస్తూ విద్యార్థినీలకు వల వేస్తున్న ఆడియోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. పర్సనల్‌ ఫోటోలను చూపించి అమ్మాయిలను వేధించడం ప్రారంభించారు. తమ లైంగిక వాంఛలు తీర్చాలని ఫోన్‌ లలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాధితుల్లో విద్యార్ధినీలు, మహిళలు వున్నారు.

శ్రీశైలం దేవస్థానం అధికారులు వెంటనే స్పందించి వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆడియోలు బయటకు రావడంతో దేవస్థానం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఓ సెక్యూరిటీ- గార్డు సెల్‌ఫోన్‌లో వేలకొద్ది అమ్మాయిలు, మహిళల ఫోటోలు ఉన్నట్లు- గుర్తించారు. కాగా ఆ సెక్యూరిటీని విధుల నుంచి తొలగించినట్లు- తెలియవచ్చింది. కాగా దేవస్థానం ప్రైవేట్‌ సెక్యూరిటీ- సిబ్బంది ఇలాంటి పాడు పనులు చేయడం భక్తులను ఆగ్రహానికి గురిచేస్తుంది. పవిత్రంగా ఉండే స్థలంలో ఇలాంటి కీచకులను తొలగించాలని.. కఠినంగా శిక్షించాలని సున్నిపేట వాసులు కోరుతున్నారు. తమ గ్రామంలో అనేకమంది విద్యార్థినిలకు ఫోన్‌ చేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement