Tuesday, April 23, 2024

5 నుంచి ఎపీలో పాఠశాలలు రీ ఓపెన్​.. ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం జూలై ఐదో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజుకు అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక(జేవీకే) కిట్లు అందజేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పాఠ్య పుస్తకాలను కూడా అదే రోజు అందజేయడం ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. అందుకోసం ఈ నెల 28 నుంచి బడులు తెరిచే ఐదో తేదీ వరకు డీవైఈవోలు, ఎంఈవోలు, హెచ్‌ఎంలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అందులో భాగంగా పాఠశాల ఆవరణ, భవనాలు, తరగతి గదులను శుభ్రపరచడం, నాడు- నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లో సామగ్రిని అడ్డు లేకుండా భద్రపరచడం వంటివి చేయాలని నిర్దేశించింది.

విద్యార్థుల నుంచి పాత పుస్తకాలు సేకరించి, లైబ్రరీలో బుక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని, జేవీకే కిట్లు ఎవరికైనా అందకపోతే.. వెంటనే ఆ బుక్‌ బ్యాంక్‌ నుంచి పుస్తకాలను పంపిణీ చేయాలి. టీఎంఎఫ్‌ కింద టాయ్‌లెట్ల శుభ్రత, తాగునీటి లభ్యత వంటివి చూడాల్సి ఉంటుంది. మరమ్మతులేవైనా ఉంటే పూర్తి చేయడంతోపాటు, పాఠశాలలు ప్రారంభమైన రోజు నుంచే మధ్యాహ్న భోజనం అందించేలా ఏర్పాట్లు పర్యవేక్షించాలి. విద్యార్థుల డ్రాపౌట్లు లేకుండా చూడటంతోపాటు, అడ్మిషన్లు నూరు శాతం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అందుకోసం పేరెంట్‌ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ ఇంటింటి సందర్శన నిర్వహించి కొత్త అడ్మిషన్లు జరిగేలా చూడాలి. ఈ మేరకు కొత్త విద్యా సంవత్సరానికి సంసిద్ధం కావాలని పాఠశాల విద్యాశాఖ సూచనలు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement