Wednesday, April 24, 2024

ఏపీకి 951, తెలంగాణకి 672 కోట్లు: ఫ్రీ వ్యాక్సినేషన్ పై ఎస్‌బీఐ అంచనా..

ఏపీలోొ 18 ఏళ్లు నిండిన వారందరికి ఉచిత వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావాలంటే ప్రభుత్వం రూ. 951 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని భారతీయ స్టేట్‌బ్యాంక్ పరిశోధన విభాగం అంచనా వేసింది. రాష్ట్రంలో 3.8 కోట్ల మంది 18 ఏళ్లు పైబడినవారే ఉన్నారని తెలిపింది ఎస్ బీఐ విభాగం. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకున్న వారిని మినహాయి ఇస్తే 3.2 కోట్ల మందికి ఇంకా టీకాలు వేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే వ్యాక్సిన్లను పక్కనపెడితే, వీరందరికీ టీకాలు ఇచ్చేందుకు రూ. 951 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఎస్‌బీఐ పరిశోధన విభాగం పేర్కొంది. ఈ మేరకు నిన్న ఓ విశ్లేషణ పత్రాన్ని విడుదల చేసింది.

అదే సమయంలో తెలంగాణకు మాత్రం ఉచిత వ్యాక్సినేషన్ కోసం రూ. 672 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని పేర్కొంది. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారు 2.7 కోట్ల మంది ఉన్నారని, వీరిలో టీకా వేసుకున్న వారిని మినహాయిస్తే ఇంకా 2.2 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని తెలిపింది. వీరందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేసేందుకు రూ. 672 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement