Friday, December 1, 2023

Sankranti Special: పిండి వంటల ఘుమఘుమలతో పల్లెటూళ్ళు

తెలుగు నాట సంక్రాంతి హడావుడి మొదలైంది. ముగ్గులతో తెలుగు నేలంతా కళకళలాడుతోంది. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ కనిపిస్తోంది. సంక్రాంతి సందర్భంగా నెల్లూరు జిల్లాలోని అన్నీ గ్రామీణ ప్రాంతాలు పిండివంటల ఘుమఘుమలతో నిండిపోతున్నాయి. దూర ప్రాంతాలలో ఉంటున్న బంధువులు పెద్ద పండుగగా పిలుచుకునే సంక్రాంతి పండుగను తల్లిదండ్రులతో బంధు మిత్రులతో చేసుకునేందుకు సొంత ఊర్లు చేరుకొంటున్నారు. పిండి వంటల్లో అరిశెలు..చక్కలు..ఇతర పదార్థాలు ఉంటున్నాయి.

ప్రత్యేకమైన రెసిపీ కారణంగా అరిసెలకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అరిశెలు‌ సక్రమంగా తయారు చేయడం కూడా ఒక కళే. బంధు మిత్రుల రాకతో పల్లెటూళ్ళు ఆనందాల లోగిళ్ళుగా మారుతున్నాయి. భోగి మంటలకు తాటాకులను రైతులు సిద్దం చేసుకున్నారు. సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకునేందుకు పల్లె ప్రజలు సిద్దమయ్యారు. పట్టణాలలో స్వగృహ ఫుడ్స్ వంటి చోట్ల అరిసెలు హాట్‌హాట్ గా అమ్ముడుపోతుండటం గమనార్హం.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement