Tuesday, March 26, 2024

AP: ముస్తాబవుతున్న సంగం బ్యారేజీ.. త్వరలో ప్రారంభోత్స‌వానికి ఏర్పాట్లు

అమరావతి, ఆంధ్రప్రభ: పెన్నా నదిపై సంగం, నెల్లూరు బ్యారేజి పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు 15 లోపు సంగం బ్యారేజిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభింపచేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు- చేస్తోంది. వీలైతే సంగం, నెల్లూరు బ్యారేజీలను కూడా ఒకే రోజు ప్రారంభించే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. బ్రిటీష్‌ హయాంలో సుమారు 100 ఏళ్ళ క్రితం నిర్మించిన రెండు బ్యారేజీలు శిధిలావస్థకు చేరుకోవటంతో వాటి స్థానంలో కొత్త బ్యారేజీల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సంగం బ్యారేజి నిర్మాణంతో నెల్లూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లోని భూములకు సాగునీటి వసతి ఒనగూరుతుంది. సంగం బ్యారేజి కింద 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సౌలభ్యం ఒనగూరుతుంది.

సంగం బ్యారేజీ గతంలో పూర్తిస్థాయిలో శిధిలావస్థకు చేరుకోవటంతో ఆయకట్టు- కనిష్ట స్థాయికి పడిపోయింది. కొన్ని వేల కుటు-ంబాల రైతులు సంగం బ్యారేజీ పునర్నిర్మాణం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఆకస్మిక మరణానికి గురైన దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తోడ్పాడుతో తాను మంత్రిగా ఉండగా బ్యారేజి పనులు శరవేగంగా పూర్తయ్యేందుకు పాటు-పడ్డారు. దీంతో ఆయన మరణానంతరం సంగం బ్యారేజీకి మేకపాటి గౌతంరెడ్డి పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది. నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్న మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సందర్శించారు.

మిగిలిపోయిన పనులను సత్వరం పూర్తి చేయాలనీ, అతి త్వరలోనే బ్యారేజిని సీఎం ప్రారంభించనున్నట్టు- ప్రకటించారు. సంగం బ్యారేజి నిర్మాణంలో గత నెల నుంచి వేగం పుంజుకున్న పది వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు, 2.16 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు కూడా ముగింపు దశకు వచ్చాయి. బ్యారేజీ గేట్ల తయారీ పనులు కూడా వేగంగా కొనసాగుతుండగా దానికి అవసరమైన రూ.145.51 కోట్ల విడుదలకు ఇటీ-వలనే ప్రభుత్వం ఆమోదం లభించింది. మొత్తం 85 గేట్లకు మోటార్లను అమర్చారు. బ్యారేజి నుంచి కుడివైపు కనుపూరు కాలువ, నెల్లూరు చెరువుకు నీటిని విడుదల చేసేందుకు అవసరమైన రెగ్యులేటర్లను బిగించటంతో పాటు- బ్యారేజి ఎడమ వైపు కనిగిరి రిజర్వాయర్‌, బెజవాడ పాపిరెడ్డి కాలువలకు నీటిని విడుదల చేసే పనులు కూడా పూర్తయ్యాయి.

కేవలం సాగునీటి సౌలభ్యానికే కాకుండా రాకపోకలకు కూడా బ్యారేజీ బాగా ఉపయోపడేలా తీర్చిదిద్దారు. మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజిపై 7.5 మీటర్ల వెడల్పుతో 1,195 మీటర్ల పొడవున నిర్మించిన రోడ్డు వల్ల అనేక గ్రామాల మధ్య రాకపోకలు కూడా సులభతరం కానున్నాయి. సంగం బ్యారేజీతో సమానంగా పనులు కొనసాగుతున్నప్పటికీ నెల్లూరు బ్యారేజి పూర్తయ్యేందుకు మరికొంత సమయం పట్టవచ్చని అంచనా. 99,525 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడే నెల్లూరు బ్యారేజి పనుల్లో ముగింపు దశ పనులను ప్రభుత్వం కొత్త కాంట్రాక్టర్‌ కు అప్పగించింది. మిగిలిపోయిన గేట్ల అమరిక, మట్టి, కాంక్రీట్‌ పనులను పూర్తి చేసేందుకు 113.36 కోట్ల అంచనా వ్యయంతో కొత్త కాంట్రాక్టర్‌ కు అప్పగించిన పనులను కూడా జలవనరుల మంత్రి రాంబాబు ఇటీవల సమీక్షించారు. పనులను వేగవంతం చేసి బ్యారేజి నిర్మాణాన్నిపూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement