Thursday, December 9, 2021

సజ్జల పేరుతో కొంతమంది కామెడీ చేస్తున్నారు

ప్ర‌భ‌న్యూస్‌, అమరావతి: సీఎంవో ఆఫీసు నుంచి సజ్జల రామకృష్ణా రెఢ్డి పిలిచారని కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు వ్యవహరిస్తున్న తీరు బాగాలేద‌ని, కామెడీగా మారిందని ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు అన్నారు. జగన్ పాదయాత్రలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ఆయ‌న గుర్తుచేశారు. ఉద్యోగుల 26 డిమాండ్ల పరిష్కారం కోసం రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నామన్నారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రి ఇట్లాంట‌ప్పుడు ఉద్యోగుల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అని ఆయ‌న ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News