Tuesday, March 14, 2023

స‌చివాల‌య సేవ‌లు ఇంటి వ‌ద్ద‌కే….

అమరావతి, ఆంధ్రప్రభ: ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో సినిమా, బస్‌, రైల్‌ టిక్కెట్లు బుక్‌ చేసుకున్నట్లుగానే గ్రామ, వార్డు సచివాలయా ల సేవలు కూడా ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా అందు బాటులోకి రానున్నాయి. ఈమేరకు ప్రభు త్వం ప్రజలు ఇంటి వద్దనే ఉండి దరఖాసు ్తచేసుకునేలా గ్రామ, వార్డు సచివాలయాల వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దుతోంది. దీనిద్వారా ప్రభు త్వం సచివాలయాల్లో అందజేస్తున్న 545 రకాల ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటకే వస్తాయి. ఇంట్లో ఇంటర్నెట్‌తో కూడిన స్మార్టు ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఉంటే చాలు.. ఎవరైనా తమ వ్యక్తిగత మెయిల్‌ ఐడీల ద్వారా ఈ 545 రకాల ప్రభుత్వ సేవలకు దరఖాస్తు చేసుకో వచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ రంగ నిపుణులను జిల్లాకు ఒకరిని నియమి స్తూనే, సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి కూడా తగు శిక్షణ ఇవ్వనున్నారు. పరిపాలన లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ను తీసుకొచ్చింది. దీంతో ప్రజలు తమ సొంత గ్రామం దాటి వేరే ఊరు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సొంత ఊరిలోనే 545 రకాల ప్రభు త్వ సేవలను పొందుతున్నారు. ప్రతి నెలా పంపిణీకి చేసే పింఛన్లు, రేషన్‌ వంటి వాటిని ఇప్పటికే వాలంటీర్ల ద్వారా లబ్దిదారుల వద్దకే ప్రభుత్వం చేరవేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ప్రజలు ప్రభుత్వం సేవలు పొంద డానికి సచివాలయానికి కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవల ను తీసుకెళ్లనుంది. ఈక్రమంలో ఎవరైనా ఇంటి వద్ద నుండే ఆన్‌లైన్‌ ద్వారా సచివాల యాల సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులు నేరుగా ఆయా శాఖల సిబ్బందికి చేరతాయి. వాటి ఆమోదం అనంతరం తిరిగి మెయిల్‌ ఐడీ ద్వారా ఆ సేవలకు సంబంధించిన సర్టిఫికేట్లను ఇంటి వద్దనే పొందే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -
   

జిల్లాకో సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు
సచివాలయాల్లో వినతుల పరిష్కారంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఎప్పటికప్పుడే వాటిని పరిష్కరించేందుకు జిల్లాకు ఒక సాఫ్ట్‌వేర్‌ నిపుణుడిని ఏర్పాటు చేస్తోంది. అలాగే, సేవలు అందజేసే సమయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన శిక్షణను సిబ్బందికి ప్రభుత్వం అందిస్తోంది. రాబోయే రోజుల్లో ఇంటి నుండే ఆన్‌లైన్‌ ద్వారా సచివాలయ సేవలను అందించేందుకు కసరత్తు చేస్తోంది. దరఖాస్తుదారులకు సంబంధింత సర్టిఫికెట్లు సాఫ్ట్‌ కాపీలను వాట్సాప్‌ లింక్‌ ద్వారా పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సేవల్లో రికార్డు :
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ సరికొత్త రికార్డు సృష్టించింది. వీటి ఏర్పాటు తర్వాత తొలిసారిగా జనవరి 25న ఒక్క రోజులోనే ఏకంగా 2.88 లక్షల మంది వినతులు పరిష్కారమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2019 అక్టోబర్‌ 2న ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నగరాలు, పట్టణాలు, గ్రామాలు, కుగ్రామాలు అనే తేడా లేకుండా ప్రజలు ఎవ్వరూ ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పనుల కోసం మండల కేంద్రాలకు లేదంటే దగ్గరలోని పట్టణాలకు అదీకాకపోతే జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి సొంత గ్రామంలోనే ఆయా పనులు అయ్యేలా వినూత్న, విప్లవాత్మక కార్యక్రమాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది. ఈ పనులు దాదాపు పరిష్కారమయ్యేలా 2020 జనవరి 26 నుండి గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 545 రకాల ప్రభుత్వ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరో 252 రకాల కేంద్ర ప్రభుత్వ సేవలను కూడా దశలవారీగా అందుబాటులోకి తెచ్చింది. వీటిద్వారా ఇప్పటివరకూ గత మూడేళ్లలో 6.43 కోట్ల మంది ప్రభుత్వ సేవలు పొందారు. అయితే, ఇప్పటివరకూ ఈ గ్రామ, వార్డు సచిఆలయాల ద్వారా ఒక్క రోజు వ్యవధిలో అత్యధికంగా 1.80 లక్షల సేవలు మాత్రమే అందజేసిన రికార్డు ఉండేది. కానీ, జనవరి 26న ఒక్క రోజే 2.88 లక్షల మంది వివిధ రకల సేవలను వినియోగించుకున్నారని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌లో అదేరోజు సాంకేతిక లోపం తలెత్తింది. అది లేకుండా ఉండిఉంటే ఈ సేవల సంఖ్య మరికొంత పెరిగేదని వారు చెబుతున్నారు.

65 శాతానికిపైగా రెవెన్యూ సేవలే
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గత మూడేళ్లలో ప్రజలకు అందంచిన మొత్తం 6.43 కోట్ల ప్రభుత్వ సేవలు చూసినా, ఈనెల 26న పరిష్కరించిన 2.88 లక్షల వినతులు చూసినా అందులో 65 నుండి 70 శాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement