Wednesday, April 24, 2024

ఎపిలో మార్చి ఒక‌టి నుంచి ఫ్యామిలీ డాక్ట‌ర్స్ ఫుల్ జోష్

అమరావతి, ఆంధ్రప్రభ: ఫ్యామిలీ డాక్టర్ల కాన్సెప్ట్‌ను మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆస్ప త్రుల సందర్శన కూడా అదే రోజు నుంచి ప్రారంభం అవుతుందన్నారు. దీనివల్ల ఆస్పత్రుల పనితీరుపై ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ ఉంటు-ందని చెప్పారు. ఏమైనా లోపాలు, సమస్యలు ఉంటే వారి నుంచి కూడా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని పరిష్కరించే చర్యలు చేపట్టాలన్నారు. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇది ఉపయోగ పడుతుందన్న సీఎం అభిప్రాయపడ్డారు. వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఆస్ప త్రుల్లో మందులు, సర్జికల్స్‌ కూడా అందుబాటు-లో ఉండాలన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ లేదా జీఎంపీ ఆధీకృత మందు లు మాత్ర మే ఇవ్వాలని ఇదివరకే ఆదేశా లు ఇచ్చా మని, దీన్ని పటి ష్టంగా అమలు చేయాల న్నారు. ఎక్కడా మందులకు కొరత ఉందన్న మాటే వినిపించ కూడదన్నారు. ప్రజారోగ్య వ్యవస్థలో దేశానికి ఏపీ ఆదర్శంగా నిలవాలన్నారు. ఇందు కోసం వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న సిబ్బందిని సంపూర్ణ స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటు-న్నట్టు- అధికారులు సీఎంకు చెప్పారు. ప్రతి విలేజ్‌ క్లినిక్‌కు నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్‌ వెళ్తారని, జనాభా 4వేలు దాటి ఉంటే మూడోసారి కూడా పంపేందుకు ఏర్పాట్లు- చేస్తున్నామని అధికారులు తెలిపారు.

సమన్వయం ఉండాలి
మార్చి 1 నుంచి గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాగి మాల్ట్‌ అందించాలన్నారు. గ్రామ సచివాలయ స్థాయిలోనే ఎనీమియా లాంటి కేసులను గుర్తించి వారి ఆరోగ్యానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పగా ఇప్పటికే ఎనిమీయా కేసులపై సర్వే చేయించామని అధికారులు వివరణ ఇచ్చారు. వీరిలో రక్తహీనతను నివారించడానికి వైద్య పరంగా, పౌష్టికాహారం పరంగా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం సూచిం చారు. వైద్యారోగ్యశాఖ – స్త్రీ శిశుసంక్షేమ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలని, డేటా అనుసంధానత ఉండాలన్నారు. స్కూల్స్‌, హాస్టల్స్‌, అంగన్‌వాడీ కేంద్రాలు అనుసంధానమై తల్లులు, పిల్లల్లో రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలని చెప్పారు. చిన్నారులు, స్కూలు పిల్లల్లో దంత శుభ్రతపై అవగాహన కల్పించాలని చెప్పారు. స్కీన్రింగ్‌ నిర్వహించి వారికి చికిత్స అందించాల న్నారు.

విలేజ్‌ క్లినిక్స్‌గురించి ప్రజలకు చెప్పండి
విలేజ్‌ క్లినిక్స్‌లో సమస్యలపై తక్షణమే స్పందిం చాలని అధికారుల్ని ఆదేశించారు. మండలస్థాయి అధికారులు, జేసీ, కలెక్టర్‌ వీటిపై పర్యవేక్షణ చేయా ల్సిందిగా సీఎం సూచించారు. పరిసరాల పరిశుభ్రత, సమతుల్య ఆహారం, వ్యాయామం ఇతర ఆరోగ్య అంశాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలన్నారు. 108, 104 వాహనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిం చాలని చెప్పారు. ప్రతిరోజు వీటిపై సమీక్ష చేయాల న్నారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ల పర్యవేక్షణ వీటిపై ఉండాలన్నారు. ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్స్‌ సిబ్బంది ప్రతి కుటు-ంబాన్నీ కలుసుకుని విలేజ్‌ క్లినిక్స్‌ సేవలను వివరించాలన్నారు.

ప్రతిబోధనాసుపత్రిలో క్యాన్సర్‌ నివారణ పరికరాలు
ప్రతి బోధనాసుపత్రిలో కూడా క్యాన్సర్‌ నివార ణా పరికరాలు, చికిత్సలు అందుబాటులో ఉండాలని సీఎం జగన్‌ అధికారుల్ని ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీల్లో కూడా ఈ పరికరాలు, చికిత్సలు ఉండాలన్నారు.
ప్రతి బోధనాసుపత్రి లోనూ గుండెజబ్బుల చికిత్సా కేంద్రాలు ఉండాలని, అన్ని చోట్ల క్యాథ్‌ ల్యాబ్స్‌ పెట్టాలన్నారు. ఈ సౌకర్యా లను మెరుగు పరచుకోవడం ద్వారా క్యాన్సర్‌ మరియు గుండె జబ్బులకు సంబంధించి మరిన్ని పీజీ సీట్లు- సాధించ డానికి అవకాశం ఉంటు-ందని సీఎం చెప్పారు. తద్వారా రాష్ట్రంలోనే సరిపడా వైద్య నిపు ణులు తయారవుతారన్నారు.
రాష్ట్రంలో క్యాన్సర్‌ వ్యాధిని ముందస్తుగానే గుర్తించి వారికి తగిన వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటు-న్నామని అధికారులు సీఎంకు చెప్పారు. వైద్య సిబ్బందికి స్కీన్రింగ్‌, చికిత్సలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement