Friday, March 29, 2024

పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు..

అమరావతి, ఆంధ్రప్రభ: తొలి ప్రయోజగం సక్సెస్‌తో జోష్‌ మీదున్న ఆర్టీసీ మలి ప్రయోగం చేస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రాలకు సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. ఇప్పటికే దక్షిణాదిలో పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందిన అరుణాచలం (తిరువన్నామలై)కి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. గతంలో ఏపీలోని పలు పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక పర్వదినాల్లో స్పెషల్‌ బస్సులు నడిపిన ఆర్టీసీ.. తొలిసారిగా అంతరాష్ట్ర పుణ్యక్షేత్రమైన అరుణా చలానికి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఆదివారం పౌర్ణమి దర్శనం, గిరి ప్రదిక్షణకు వివిధ ప్రాంతాల నుంచి పదకొండు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెపుతున్నారు. ఆర్టీసీలో స్పెషల్‌ బస్సుల్లో చార్జీపై 50శాతం అదనపు రుసుము వసూలు చేస్తారు. గత కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీకి ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఈ ఏడాది చెక్‌ పెట్టారు. ప్రయోగా త్మకంగా సాధారణ బస్సు చార్జీలతోనే దసరా స్పెషల్స్‌ నడిపి విజయవంతమయ్యారు.

గతంతో పోల్చితే దసరా ప్రత్యేక బస్సుల ద్వారా ఆర్టీసీకి రెట్టిం పు ఆదాయం సమకూరింది. స్పెషల్‌ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్‌) అనూహ్యంగా పెరగడంతో ఇదే విధానం కొనసాగించేందుకు ఎండీ తిరుమలరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎండీ ఆదేశాల నేపధ్యంలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో కడప, ప్రొద్దు టూరు, జమ్మలమడుగు, పుంగ నూరు, నెల్లూరు, నరసరా వుపేట తదితర పట్టణాల నుంచి పదకొండు ప్రత్యేక సర్వీసు లను అరుణాచలానికి నడిపారు. ఆయా బస్సులు పూర్తి సీటింగ్‌ సామర్థ్యంతో నడిచినట్లు అధికారులు చెపుతున్నారు. ఇకపై అరుణాచలానికి ఏపీలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను పౌర్ణమి ముందు రోజు బయలుదేరాలా చర్యలు చేపట్టనున్నారు. ఆ రోజు అరుణాచలేశ్వరుని దర్శనంతో పాటు గిరి ప్రదిక్షణ ముగించుకొని రాత్రికి బయలుదేరి తిరిగి మరుసటి రోజు ఉద యం స్వస్థలానికి చేరుతుంది. ఆయా బస్సుల్లో కూడా సాధా రణ చార్జీలు వసూలు చేయ డం ద్వారా ఎక్కువ మంది సాధా రణ ప్రయాణికులు అరుణా చలేశ్వరుని దర్శనానికి వెళ్లే అవ కాశం ఉంటుందని అధికా రులు అంచనా వేస్తున్నారు.

ఇదే క్రమంలో ఏటా కార్తీక మాసంలో పంచారామాల సందర్శన కు ఆర్టీసీ ఏర్పాటు చేయనున్న బస్సుల్లో కూడా సాధారణ చార్జీల వసూలుకే అధికారులు నిర్ణయించారు. కోవిడ్‌ మహ మ్మారి నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీ అదనపు ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా పలు సరి కొత్త నిర్ణయా లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆయా పర్వదినాల్లో సాధారణ చార్జీలతోనే ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమ వుతోంది. తద్వారా ఎక్కువ మంది ప్రయాణికులకు చేరువ కావడమే ఆర్టీసీ ప్రధాన ఉద్దేశం.

Advertisement

తాజా వార్తలు

Advertisement