Wednesday, November 27, 2024

AP : రోడ్డుప్ర‌మాదం.. వేములవాడ యువకుడు మృతి

ఆంధ్రప్రదేశ్ లోని పెనుగొండ వద్ద రోడ్డు ప్రమాదంలో వేములవాడ పట్టణానికి చెందిన అయ్యప్ప భక్తుడు వంగపల్లి హరీష్ (28) అనే యువకుడు మృతిచెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది.

గత 24 రోజుల క్రితం కేరళ రాష్ట్రం అయ్యప్ప స్వామి క్షేత్రం కోసం పదిమంది సభ్యులతో కూడిన బృందం పాదయాత్ర ప్రారంభించారు. శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢీకొట్టడంతో హరీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. హరీష్ మరణ వార్తతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయ. వేములవాడ పట్టణంలో విషాద ఛాయలు నెలకొన్నాయి .పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement