Wednesday, October 9, 2024

AP: రోడ్డుప్రమాదం… ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దివాన్ చెరువు జాతీయ రోడ్డుపై లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెనుక నుంచి వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు ప్రవీణ్ కుమార్, చింతా కార్తీక్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మృతుల బంధువులకు సమాచారం అందజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement