గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు మండలం కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ముందు ఈ ఘటన ఇవ్వాల (మంగళవారం) రాత్రి జరిగింది. ఎన్ హెచ్ 16 రహదారి ఫ్లై ఓవర్ పై ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో వాహనం మీద ప్రయాణిస్తున్న కుటుంబసభ్యులు నలుగురిలో భార్య, కూతురు ఫ్లైఓవర్ మీద నుంచి కిందపడి అక్కడకక్కడే చనిపోయారు. కుటుంబ యజమాని వాహన చోదకుడు ఆయన కుమారుడుకు తీవ్ర గాయాలు అవటంతో పరిస్థితిని గమనించిన ప్రయాణికులు 108లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రమాద బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -