Tuesday, March 26, 2024

చుక్కలనంటుతున్న కూరగాయల ధరలు..

ఒంగోలు, ప్రభన్యూస్‌: జిల్లాలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. వినియోగానికి తగ్గట్టుగా కూరగాయల ఉత్పత్తి లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయాల ధరలు ఆమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యుడి పరిస్థితి ఏమి కొనేటట్టు లేదు. రూ.500 తీసుకొని వెళితే నాలుగు కూరగాయాలు కూడా రావడం లేదు. టమాట కిలో రూ.100లు పలుకుతుండటం గమనార్హం. ఏ కూరగాయాలు చూసినా కిలో రూ. 70-80లు ఉన్నాయి.

కూలీనాలి చేసుకునే పేదలకు రోజంతా కష్టపడ్డా వచ్చిన దాన్ని కూరగాయాలు కూడా సరిపోకపోవడంతో ఒక పూట తిని మరో పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం పెరుగుతోన్న కూరగాయాల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మొదట కూరగాయాల రేటు వింటుంటేనే.. వినియోగదారుల గుండె గుభేలమంటోంది. తాజాగా ఉల్లిపాయలు, టమోటాల రేటు పెరిగింది. అవసరానికి మాత్రమే వాటిని కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటితో పాటు కూరగాయల ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. పెరిగిన కూరగాయాల ధరల కారణంగా ఏమి తినేటట్టు లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు:

ఉల్లిపాయం కిలో రూ. 70-80
టమోటా కిలో రూ.100
బీన్స్‌ కిలో రూ.80
క్యారెట్‌ కిలో రూ. 90
చిక్కుడు కిలో రూ. 80
వంకాయ కిలో రూ. 70
బీరకాయ కిలో రూ. 80
క్యాలిఫ్లవర్‌ కిలో రూ. 50
కాకరకాయ కిలో రూ. 70
బెండకాయ కిలో రూ. 75
క్యాబెజీ కిలో రూ. 50

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement