హైదరాబాద్ – : మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు(66) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. 1999లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఓడిన ఆయన 2014లో వైసీపీ నుంచి యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండేళ్లకే టీడీపీలో చేరారు. పార్టీలో గొడవలతో మళ్లీ వైసీపీ గూటికి చేరినా క్రియాశీలకంగాపనిచేయలేదు.
Advertisement
తాజా వార్తలు
Advertisement