Wednesday, April 24, 2024

సింధు పుష్కర యాత్రికుల తిరుగు ప్రయాణం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ :  సింధు నది పుష్కరాల కోసం జమ్ము-కాశ్మీర్ వెళ్లి, ట్రావెల్ ఏజెంట్ మోసంతో ఇబ్బందులు పడ్డ శ్రీకాకుళం జిల్లా యాత్రికులు సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నారు. ట్రావెల్ ఏజెంట్ మోసగించడంతో యాత్రికులు వైష్ణోదేవి-కట్రాలోని కాంటినెంటల్ హోటల్‌లో బందీలుగా చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఫోన్ ద్వారా తమ గోడు వెల్లబోసుకోవడంతో మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి.

ఈ విషయం తెలుసుకున్న శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కే. రామ్మోహన్ నాయుడు (టీడీపీ)తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని వారిని విడిపించేందుకు ప్రయత్నించారు. ఫలితంగా హోటల్‌లో బందీలుగా ఉన్న 30 మంది యాత్రికులు సురక్షితంగా శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. అక్కణ్ణుంచి తమ స్వస్థలాలకు బయలుదేరారు. ఈ సందర్భంగా తమను విడిపించడం కోసం కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement