Tuesday, April 16, 2024

Flash: రేపల్లె అత్యాచార కేసు: బాలుడు సహా ముగ్గురు నిందితులు అరెస్ట్

ఏపీవ్యాప్తంగా సంచలన సృష్టించిన రేపల్లె అత్యాచార కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. విజయకృష్ణ, నిఖిల్ అనే యువకులతో పాటు ఓ బాలుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను ఎస్పీ వకుళ్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగిందని ఎస్పీ చెప్పారు. నిందితులు టైమ్ అడిగి బాధితురాలి భర్తతో గొడవ పెట్టుకున్నారని తెలిపారు. తన వద్ద వాచీ లేదని చెప్పడంతో అతడిని కొట్టి రూ.750 లాక్కున్నారని వెల్లడించారు. బాధితురాలిని జుట్టు పట్టుకుని లాక్కెళ్లారని తెలిపారు. స్థానికుల సాయంతో ఆమె భర్త రేపల్లె పోలీసులను ఆశ్రయించాడని వివరించారు. పోలీసు జాగిలం, ఇతర మార్గాల ద్వారా ఆధారాలు సేకరించి నిందితులను గుర్తించామని తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఎస్పీ వకుళ్ జిందాల్ స్పష్టం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement