Thursday, April 25, 2024

Ramathirtham: దేవుడి పేరుతో రాజకీయాలొద్దు

రామతీర్థంలో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో కొండపై శ్రీ సీతారాముల విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ సందరభంగా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. గత ఏడాది డిసెంబర్ లో ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభించి కేవలం నాలుగు నెలల కాలంలో పూర్తి చేశామని తెలిపారు. రూ.3 కోట్లతో రికార్డు సమయంలో ఆలయ నిర్మాణం పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ట చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వున్న చిత్తశుద్ధికి నిదర్శనం అని పేర్కొన్నారు. రామతీర్ధంలో విగ్రహ ధ్వంసం ఘటన దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. నాలుగు నెలల్లో ఆలయం నిర్మించి విగ్రహప్రతిష్ట చేశామన్నారు. మిగిలిన పనులు మరో మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. దేవుడిపేరుతో రాజకీయాలొద్దని మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు.  

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ కమిషనర్ డా.ఎం.హరిజవహర్ లాల్, జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి, శాసన సభ్యులు బడుకొండ అప్పల నాయుడు, బొత్స అప్పల నరసయ్య, ఎమ్మెల్సీలు రఘు రాజు, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

కాగా, విజయనగరం జిల్లా రామతీర్థం గ్రామంలోని బోడికొండ కొండలపై పునరుద్ధరించిన శ్రీ కోదండ రామస్వామి దేవాలయం సోమవారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆలయాలను నిర్మించడానికి పురాతన మాన్యువల్ అయిన ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ఆలయం రాతి నిర్మాణం మరియు ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడింది. డిసెంబర్ 28, 2020న గుర్తుతెలియని దుండగులు రాముడి విగ్రహాలను ధ్వంసం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు వెచ్చించి ఆలయాన్ని పునర్నిర్మించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement