Friday, October 11, 2024

AP | కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్…

ఏపీలో కొత్త మద్యం షాపుల దరఖాస్తుకు నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త మద్యం దుకాణాల కోసం నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 11న 3396 మద్యం దుకాణాలకు లాటరీ తీయనున్నారు. రెండేళ్ల కాలపరిమితితో అక్టోబర్ 12 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది.

కాగా, గీత కులాలకు రిజర్వ్‌ చేసిన మరో 340 షాపులకు విడిగా నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ప్రీమియం బ్రాండ్లు విక్రయించేందుకు ఏర్పాటు చేయనున్న 12 ఎలైట్‌ షాపులకు కూడా విడిగా నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.

ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని అప్లికేషన్లు అయినా పెట్టుకోవచ్చు. ఈ నెల 11న 3396 షాపులకు లాటరీ తీస్తారు. దరఖాస్తుదారులు రూ.2 లక్షలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్‌ ఫీజులు రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షలు వరకు నిర్ణయించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగిసింది. కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకూ ప్రస్తుతం ఉన్న దుకాణాలను కొనసాగిస్తామని ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement