Sunday, March 24, 2024

టీడీపీ అభ్య‌ర్థుల నామినేష‌న్ల తిర‌స్క‌ర‌ణ

చిత్తూరు జిల్లాలోని బంగారు పాల్యం, కలకడ మండలాలకు సంబంధించిన జ‌డ్పీటీసీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శుక్రవారం నాడు దాఖలు చేసుకున్న నామినేషన్ పత్రాలు సక్రమంగా లేవని అందువల్ల వారి దరఖాస్తులను తిరస్కరిస్తున్న‌ట్లు ఎన్నికల అధికారి ఎం.ఎస్ మురళి ప్రకటించారు. బంగారుపాళ్యం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గిరిబాబు అఫిడవిట్ వీటిలో కాలం సంఖ్య 5 ( 9), సదరు అభ్యర్థి ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రంలో రుణం క్లియర్ కాలేదని ప్రత్యర్థి అభ్యంతరం తెలిపారు.

అదేవిధంగా కలకడ మండలం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ ను దాఖలు చేసిన సురేఖ దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు ఫారంలో నమోదు చేసిన పుట్టిన తేదీ, కుల ధ్రువీకరణలో ఇచ్చిన పుట్టినతేది, ఆధార్ కార్డులో గల తేదీలు వేరు వేరుగా ఉన్నాయని, వయస్సు నిర్ధారణకు సంబంధించి ధ్రువీకరణ సమర్పించలేదు. డిక్లరేషన్ ఫారంలో దరఖాస్తుకు సాక్షి సంతకం చేసిన వారి అడ్రస్ వ్రాయలేదని, పొదుపు సంఘంలో రెండవ లీడర్ గా వుంటూ రుణం క్లియర్ చేయలేదని, అందుకు సంబంధించి ప్రత్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ సమక్షంలో నవంబరు 7 తేదీ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 లోపల అప్పీలు చేసుకోవచ్చునని రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమానికి రిటర్నింగ్ అధికారితో పాటు, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, ఏఆర్వోలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement