అమరావతి .టిడిపి రాజ్యసభ సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తెలుగు దేశం పార్టీ ప్రకటించింది. రాజ్య సభ స్థానానికి రాజీనామా చేసి వైసిపి నుంచి టీడీపీ లోకి చేరిన బీద మస్తాన్ రావు మరోసారి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఇక కాకినాడ లోకసభ సీటు ఆశించి సమీకరణ లతో జన సేన అభ్యర్థికి దక్కడం తో డీలపడిన సానా సతీష్ ను పెద్దల సభకు పంపనున్నారు. ఈ మేరకు ఈ ఇద్దరు పేర్లను ఖరారు చేస్తూ టీడీపీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక మూడో సీటు బీజేపీ. కి కేటాయించగా ఆర్ కృష్ణయ్య ను ఆ పార్టీ బరిలోకి దింపింది.
రేపు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక రాజ్య సభ సీటు ఆశించిన పవన్ సోదరుడిని ఏపీ కేబినెట్ లోకి తీసుకోనున్నారు. చంద్ర బాబు మంత్రి వర్గం లో ఒకే ఒక స్థానం ఖాళీ ఉండగా ఆ బెర్త్ ను జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు చంద్ర బాబు.