Wednesday, April 24, 2024

Rains: ఏపీలో భారీ వ‌ర్షాలు.. నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై తీవ్ర ప్ర‌భావం

Alert Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. సముద్రతీర ప్రాంతాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. అటు తమిళనాడుతో పాటు.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.

బంగాళాఖాతంలో(Bay of Bengal) కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో దాదాపు 75 శాతం చెరువులు నిండిపోయాయి. చిత్తూరు, తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

రిజర్వాయర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండ‌డంతో దిగువకు నీరు వదులుతున్నారు. అటు తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం డ్యామ్‌లు పూర్తి స్థాయిలో నిండటంతో నీటికి దిగువకు విడిచిపెట్టారు. ఆకాశగంగ, కుమారధార ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి.

ఇక నెల్లూరులోనూ పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రవాణా స్థంభించిపోయుంది. కోడూరు, మైపాడు స‌ముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. వేటకు వెళ్లిన మత్స్యకారుల్ని తిరిగి రావల్సిందిగా అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేశారు.

కృష్ణా జిల్లాలో కూడా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాబోయే రోజుల్లో వర్షాలు విపరీతంగా కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ప్రధానంగా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తాలో ఎల్లుండి, ఆవ‌లెల్లుండి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement