Saturday, June 19, 2021

ఇవాళ రేపు ఏపీలో వర్షాలు..

ఇవాళ, రేపు ఏపీలో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రేపు మరింత బలపడి ఒడిశా మీదుగా వెళ్లనుంది. దీంతో ఉత్తర కోస్తాంధ్రలో ఇవాళ కొన్నిచోట్ల తేలికపాటి నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందిన ఐఎండీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News