Friday, April 19, 2024

రాయలసీమకు వర్షసూచన.. వెల్ల‌డించిన వాతావ‌ర‌ణ శాఖ‌..

అమరావతి, ఆంధ్రప్రభ: రాయలసీమ పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది.ఉత్తర -దక్షిణ ద్రోణి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుండి కొమరిన్‌ వరకు తెలంగాణా, రాయలసీమ మరియు తమిళనాడు. గుండా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించింది. ఈ కారణంగా సోమ, మంగళవారాల్లో తేలిక పాటి నుండి భారీ వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. గడిచిన నాలుగు రోజులుగా రాయలసీమ ప్రాంతంలో ఎండలు మండుతున్నాయి.

ఈశాన్యం నుంచి వేడి గాలులు వీస్తుండటంతో సాధారణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా, దక్షిణకోస్తా ఆంధ్రప్రదేశ్‌ యానాం ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆదివారం కళింగపట్నం, జంగమేశ్వర పురం ప్రాంతాల్లో 0.2 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement